- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి మూడు మంచి అంచనాలు ఉన్న సినిమాలు థియేటర్లలోకి దిగాయి. వీటిలో రెండు సినిమాలు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు స్వయంగా నిర్మించినవి కావటం విశేషం. రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాతో పాటు వెంకటేష్ - అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెర‌కెక్కిన సంక్రాంతికి వస్తున్నాం ఈ రెండు సినిమాలు దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కయి. వీటితోపాటు నందమూరి నటసింహం బాలకృష్ణ - బాబి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ - సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన డాకు మహారాజ్‌ సినిమా కూడా సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. డాకూ మహారాజ్‌ సినిమాను కూడా నైజం ఏరియాలో దిల్ రాజు సొంతంగా పంపిణీ చేసుకున్నారు. అలా సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాలను కూడా నైజాంలో దిల్ రాజు పంపిణీ చేశారు.


ఇక్కడ వరకు బాగానే ఉంది అయితే డాకు మహారాజ్ సినిమా నైజాంలో అనుకున్న స్థాయిలో రిలీజ్ కాలేజ్ అని స్వయంగా హీరో నందమూరి బాలకృష్ణ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సుమారు నైజం లో 180 స్క్రీన్ లలో మాత్రమే బాలయ్య సినిమా రిలీజ్ అయింది. ఇదే సంస్థ గతంలో నిర్మించిన మహేష్ బాబు గుంటూరు కారం సినిమాకు 260 నుంచి 270 స్క్రీన్లు దక్కాయి. అప్పుడు కూడా వెంకటేష్ సైంధవ్ - హనుమాన్ - నాగార్జున సినిమాలు పోటీలో ఉన్నాయి. బాలయ్య గత సినిమా భగవంత్‌ కేసరికి చాలా ఎక్కువ థియేటర్లు దొరికాయి. డాకు మహారాజ్ సినిమా నైజాంలో లాంగ్ ర‌న్‌లో రు. 13 కోట్లు మించి వసూలు చేసే పరిస్థితి లేదు. అది కూడా వితౌట్ జీఎస్టీ అంటున్నారు.


వెంకటేష్ సంక్రాంతి వస్తున్నాం సినిమా ఇప్పటికే నైజాంలో కాస్త అటు ఇటుగా రు. 25 కోట్ల షేర్ కొల్లగొట్టింది. దిల్ రాజు తన సినిమాకు ఎక్కువ థియేటర్లు కేటాయించుకున్నారని.. ఎక్కువ షోలు ఎక్కువ స్క్రీన్ లు పెట్టుకున్నారని ... బాలయ్య సినిమాకు తక్కువ ధియేటర్లు ఇచ్చి తక్కువ షోలు ఇవ్వడంతో అనుకున్న స్థాయిలో వసూలు చేయలేదని అంటున్నారు. బాలయ్య సినిమాకు సరైన థియేటర్లు.. సరిపడా  స్క్రీన్లు దొరికి ఉంటే మరో రెండు మూడు కోట్లు ఓపెనింగ్స్ వచ్చేవని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలలో చర్చ నడుస్తోంది. నైజాం ఏరియాలో బాలయ్య సినిమాను పంపిణీ చేసిన దిల్ రాజు వైజాగ్ ఏరియాలో డాకు మహారాజును విడుదల చేయలేదు.


అక్కడ పూర్వి వీర్రాజు విడుదల చేశారు. వైజాగ్ ఏరియాలో డాకు మహారాజు సినిమాకు మంచి రిలీజ్ దొరికింది.. ఇవన్నీ తీవ్ర అసంతృప్తి కారణమవుతున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా టాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ మాఫియా దెబ్బకు బాలయ్య సినిమాకే గతి లేదు. మరి మిగిలిన వాళ్ళు వీళ్ల‌ను ఎలా ?త‌ట్టుకుంటారు అన్న చర్చ‌లు కూడా నడుస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: