మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తాను నటిస్తోన్న ‘ విశ్వంభర ’ సినిమాను వచ్చే సమ్మర్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు. ఈ సినిమాను బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట్ డైరెక్ట్ చేస్తుండడంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. అయితే కొద్ది రోజుల క్రితం రిలీజ్ అయిన టీజర్ తుస్సు మనిపించింది. విజువల్స్ మరీ నాసిరకంగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కూడా ఇండస్ట్రీ లో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత చిరు తన తర్వాత సినిమా లను చాలా స్ట్రాంగ్ లైనప్ తో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.
విశ్వంభర సినిమా పూర్తయిన వెంటనే యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల తో చిరంజీవి తన తర్వాత సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాలో చిరంజీవిని సరికొత్త పాత్రలో శ్రీకాంత్ చూపించబోతున్నట్లు కూడా సమాచారం. ఇక మరో డైరెక్టర్ అనిల్ రావిపూడి తో కూడా చిరు ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ రెండు సినిమాల తర్వాత చిరు తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ సినిమా లతో దూసుకు పోతోన్న బాబి తో కూడా చిరు ఓ సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది.
బాబి వరుసగా చిరు తో వాల్తేరు వీరయ్య.. తాజాగా సంక్రాంతికి బాలయ్యతో తెరకెక్కించిన డాకు మహారాజ్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నాడు బాబీ. ఈ సినిమాలో బాలయ్య ను బాబి చాలా స్టైలీష్ గా చూపించారు. ఇది అందరికి బాగా నచ్చేసింది. ఈ క్రమంలోనే తనకు గతంలో వాల్తేరు వీరయ్య లాంటి హిట్ ఇచ్చిన బాబి కథకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు భోగట్టా. దీంతో బాబితో మరో సినిమా చేసేందుకు చిరు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.