అయితే సునీత సింగర్ గా రాణిస్తున్న సమయంలోనే తన కుటుంబ సభ్యులు అతి చిన్న వయసులోనే వివాహం చేశారు. వారికి ఇద్దరు పిల్లలు జన్మించిన అనంతరం ఏవో కారణాల వల్ల విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు. అప్పటి నుంచి సునీత తన పిల్లలను చూసుకుంటూ సింగిల్ గానే గడుపుతోంది. ఇక గత కొన్ని సంవత్సరాల క్రితం సునీత ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేని అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకుంది.
సునీత రెండవ వివాహం చేసుకోవడం వల్ల ఎన్నో విమర్శలను సైతం ఎదుర్కొంది. వీటన్నింటినీ సునీత పట్టించుకోకుండా తన లైఫ్ ను సంతోషంగా కొనసాగిస్తోంది. కాగా, సింగర్ సునీత కుటుంబానికి కొత్త కష్టాలు వచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్ లో ఐటీ అధికారులు తమ దూకుడు కోనసాగిస్తున్నారు. ఇప్పటికే నిర్మాత దిల్ రాజు ఇళ్లపై, ఆఫీసులపై దాడులు నిర్వహించారు. అలాగే ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ ఇళ్లపై, ఆఫీసులపై ఐటి అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు.
హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఐటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అలాగే మ్యాంగో మీడియా సంస్థలపై కూడా ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. సింగర్ సునీత భర్తకు సంబంధించిన ఆఫీసులు, ఇళ్లపై కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దీంతో సింగర్ సునీత భర్తకు ఐటీ అధికారుల నుంచి వేధింపులు వస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.