తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి ఇతర భాషలలోని యాక్టర్స్ కూడా పలు చిత్రాలలో నటించి బాగానే పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా మలయాళ నటుడుగా వినాయకన్  తెలుగులో అసాధ్యుడు సినిమాలో నటించారు.ఆ తర్వాత విశాల్ నటించిన ఒక చిత్రంలో కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ నటించిన జైలర్ సినిమాలో కూడా తన అద్భుతమైన నటనను కనబరిచి భారీ క్రేజీ సంపాదించుకున్నారు యాక్టర్ వినయాకన్.. అయితే అప్పుడప్పుడు ఈయన మద్యం తాగి చేసేటువంటి పనుల వల్ల ఈయనకు విలువ లేకుండా పోతుందట.


గతంలో కూడా ఒక టీ కొట్టు సెంటర్ దగ్గర ఫుల్లుగా తాగి రోడ్డుమీద రచ్చ చేసిన వీడియో కూడా వైరల్ గా మారింది. ఇలా నిరంతరం ఏదో ఒక వార్తలలో నిలుస్తూ ఉన్న ఈ నటుడు ఇప్పుడు తాజాగా మరొకసారి తన ఇంటి బాల్కనీలోనే మద్యం మత్తులో ఒక వీరంగం సృష్టించినట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారుతున్నది. ముఖ్యంగా లుంగీ కట్టుకొని నిలబడి పొరుగింటి వారితో గొడవ పడుతూ ఉన్నట్టుగా కనిపించడమే కాకుండా వారిపై అరుస్తూ బండ బూతులు తిడుతున్న ఒక వీడియో వైరల్ గా మారుతున్నది.


మద్యం మత్తులో తాగుతూ సరిగా నిలవలేని పరిస్థితిలో కనిపిస్తున్నాడు నటుడు వినాయకన్.. ఇలాంటి ప్రవర్తనత తరచూ వార్తలలో నిలుస్తూ ఉన్న ఈ నటుడు ఈయన ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి అంటూ కూడా పలువురు నెటిజెన్స్ డిమాండ్ చేయడం జరుగుతోంది. మరి ఈ విషయం పైన అటు మలయాళ ఇండస్ట్రీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి. గోవాలో కూడా వినాయాకన్ ఒక షాపు వ్యాపారితో గొడవ పెట్టుకుని మరి ఫుల్లుగా తాగి రచ్చ చేశారు.. నటుడుగా ఎంత పేరు సంపాదించారు ఇలా మద్యం తాగి ఇలాంటి పనులు చేయడంతో ఆ పేరు అంతా కూడా పోగొట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: