సలార్, కల్కి 2898 ఏడీ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను సొంతం చేసుకున్న ప్రభాస్, అదే ఊపులో మరిన్ని చిత్రాలను లైన్లో పెట్టారు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్‌' మూవీ చేస్తున్నారు.ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది.ఈ సినిమాకు ‘ఫౌజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, చివరిగా సీతారామం వంటి భిన్నమైన కథాంశంతో భారీ హిట్ను అందుకున్న హను రాఘవపూడి ఈ సారి వార్ నేపథ్యంలో ఒక మంచి ప్రేమ కథతో ఫౌజీని తెరకెక్కిస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా ఇది రానుంది. దీంతో ఈ చిత్రం ఎలా ఉంటుంది? అని ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే, ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే తన సినిమాలలో ఇప్పటివరకు ప్రభాస్ కనిపించని ఒక పాత్రలో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన ఒక సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని ముందు నుంచి ప్రచారం జరుగుతూ ఉండగా ఇప్పుడు ఆయన ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాస్ కాలి గాయం నుంచి కోలుకుంటున్నాడు. 

ఆయన రాజా సాబ్ పెండింగ్ షూట్ పూర్తి చేసి హను రాఘవపూడి ఫౌజీ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించాలి. ఫౌజీ కొత్త షెడ్యూల్ త్వరలో తమిళనాడులోని మధురై సమీపంలోని కరైకుడిలో ప్రారంభం కానుంది.ఇక్కడ దేవీపురం అగ్రహారం నేపథ్యంలో బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన సీన్స్‌ను షూట్ చేయబోతున్నారట.ఈ షెడ్యూల్ 20 రోజుల పాటు సాగనుందని చిత్ర వర్గాల టాక్. ఇక ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్నాడు. మరి నిజంగానే ఈ సినిమాలో ప్రభాస్ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా కనిపిస్తాడా అనేది చూడాలి.ఇదిలావుండగా ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఎమోషనల్ లవ్ స్టోరీ కలిగి ఉన్న హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా అని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: