గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం'డాకు మహారాజ్'సక్సెస్ జోష్ లో ఉన్నాడు.జనవరి 11 న వచ్చిన ఈ మూవీ ఇప్పటికే 156 కోట్ల రూపాయిల గ్రాస్ ని సాధించగా చాలా ఏరియాల్లో ఇంకా స్ట్రాంగ్ రన్ ని చవిచూస్తుంది.చిత్ర బృందం కూడా ఇటీవల సక్సెస్ మీట్ ని నిర్వహించి అభిమానుల్లో ఆనందోత్సవాలని తీసుకొచ్చిందని చెప్పవచ్చు.ఇక ఈ మూవీ తర్వాత బాలయ్య అఖండ పార్ట్ 2 తో సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న విషయం తెలిసిందే.ఇదిలావుండగా డాకు మహారాజ్‌ సక్సెస్‌తో జోష్‌ మీదున్న బాలకృష్ణ ఏమాత్రం ఆలస్యం చేయకుండా అఖండ 2 సినిమాను ముగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బోయపాటి ఈ నెల చివర్లోనే కొత్త షెడ్యూల్‌ను ప్లాన్‌ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. బోయపాటి విరామం లేకుండా అఖండ 2 పనిలోనే ఉన్నారు.ఈ క్రమంలో యూపీలో జరుగుతున్న మహా కుంభమేళాలో దాదాపు వారం రోజులు బోయపాటి, అతడి టీం మెంబర్స్‌ పాల్గొన్నారు. అక్కడి అఘోరాల జీవన విధానంను పరిశీలించడంతో పాటు, పలు రకాలుగా అక్కడి విజువల్స్‌ను షూట్‌ చేశారు. బాలకృష్ణ అఖండలో అఘోరగా కనిపించిన విషయం తెల్సిందే.

సీక్వెల్‌లోనూ ఆ పాత్ర ఉంటుందని తెలుస్తుంది. అందుకే లక్షలాది మంది అఘోరాలు ఉండే మహా కుంభమేళాలో అఖండ 2 కి సంబంధించిన కొన్ని షాట్స్‌ను చిత్రీకరించారు. మహా కుంభమేళా పర్యటన ముగించుకున్నారు.ఆ తరువాత ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలను గుడిమెట్ల కొండలు, కృష్ణానది ప్రాంతంలో చిత్రీకరించాలని బోయపాటి భావిస్తున్నారు.ఇందులోభాగంగానే తాజాగా ఆయన ఎన్టీఆర్‌ జిల్లా నందిగామలో పర్యటించి అక్కడి లొకేషన్స్‌ చూశారు. నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం వద్ద కృష్ణానదీ తీర ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. షూట్‌కు ఈ ప్రాంతం అనువుగా ఉంటుందా? లేదా? అనే విషయం, ఆ లొకేషన్స్‌కు సంబంధించిన విషయాల గురించి స్థానికులతోనూ మాట్లాడారు.ఇదిలావుండగా దసరా సందర్భంగా సెప్టెంబర్ నెలలో సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: