జనవరి 19న తానేలో అరెస్ట్ అయిన అనంతరం బంగ్లాదేశ్ జిల్లా జాతీయ స్థాయిలో రెజ్లింగ్ పోటీల్లో అతను పాల్గొన్నట్లుగా పోలీసులు వెల్లడించారు. నిందితుడు సరైన పత్రాలు లేకుండానే బంగ్లాదేశ్ కు చేరుకోవడం జరిగింది. దాడి జరిగిన కొన్ని నెలల ముందు నుంచి అతను ముంబై ప్రాంతంలో నివసిస్తున్నాడు. బాంద్రాలోని సద్గురు శరన్ భవనంలో ఉన్న సైఫ్ అలీఖాన్ ఇంట్లో దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే మహమ్మద్ అడుగుపెట్టినట్లుగా వెళ్లడైంది.
ఈ ఘటన అనంతరం సైఫ్ వ్యక్తిగత విషయం గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. సైఫ్ టీమిండియా మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడి, హిందీ నటి షర్మిల ఠాగోర్ దంపతుల కుమారుడు. 1991లో హిందీ నటి అమృత సింగ్ ను వివాహం చేసుకున్నాడు. వీరికి సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీఖాన్ అనే పిల్లలు జన్మించారు. అనంతరం 2004లో వీరిద్దరూ విడాకులు తీసుకోగా.... 2012లో హీరోయిన్ కరీనా కపూర్ ను వివాహం చేసుకున్నాడు.
వీరికి ఇద్దరు కుమారులు. కాగా, తాజా నివేదికల ప్రకారం ఇప్పటివరకు రూ. 1,180 కోట్ల రూపాయలు సంపాదించారు. కాగా సైఫ్ పూర్వీకులు పటౌడి నవాబులు. వీరికి హర్యానాలో పటౌడి ప్యాలెస్ కూడా ఉంది. 10 ఎకరాలలో 150 గదులు, 7 పడక గదులు కలిగిన విశాలమైన ప్యాలెస్ కావడం విశేషం. దాని ధర రూ. 800 కోట్లు. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, హర్యానా వంటి ప్రాంతాలలో కూడా రూ. 5000 కోట్ల ఆస్తులకు పైనే ఉన్నాయి. వీటన్నింటికీ సైఫ్ అలీఖాన్ అధిపతి.