అంతేకాదు ఎవరైతే అలా ప్రచారం చేస్తున్నారో.. వాళ్ళు ఎవరైనా సరే తాట తీసేస్తామన్నారు . ఓ రేంజ్ లోనే స్లైట్ వార్నింగ్ ఇచ్చారు. కాగా ఇలాంటి క్రమంలోనే తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు . ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. " మా దృష్టిలో మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు మేము చంద్రబాబుతో కలిపి నలుగురు అనుకుంటున్నాం. లొకేష్ ని డిప్యూటీ పదవిలో చూడాలని టిడిపి క్యాడర్ కోరుకోవడంలో అసలు తప్పే లేదు . అదే విధంగా మాకు కూడా పవన్ కళ్యాణ్ ని సిఎంగా చూడాలి అనేది కోరిక. దాదాపు 10 ఏళ్లకు పైగా ఈ మూమెంట్ కోసం ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. పవన్ ని సీఎం గా చూడాలి అని బడుగు బలహీన వర్గాలన్నీ కోరుకుంటున్నాయని వివరించారు .
ఎన్నికల ముందు అధినేతలు ఎలాంటి ఒప్పందంతో ఎన్నికలకు వెళ్లారో అదే కొనసాగిస్తే మంచిది అని.. అనవసరంగా వైసిపి నేతలకు మాటలకు ఊపిరి పోయకండి అంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు . అయితే అసలు ఈ ఇష్యూ రావడానికి వైసిపి లోని కొంతమంది పెద్దలు కారణమంటూ కూడా టాక్ వినిపిస్తూ వచ్చింది . కాగా పొలిటికల్ పరంగా మెగా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయొద్దు అంటూ మెగా ఫాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు . ఆల్రెడీ అల్లు అర్జున్ ని పొలిటికల్ పరంగా లాగి ఆయన కెరియర్ ఎలా ఇబ్బందులకు గురి చేశారో అందరికీ తెలిసిందే . మెగా బ్రదర్స్ అంటే ముగ్గురే.. ఆ ముగ్గురుని మేము ఊహించుకుంటాం . మిగతా వాళ్ళు మెగా బ్రదర్స్ లిస్టులోకి రారు . మెగా ఫ్యామిలీ సపోర్టర్స్ గా ఉంటారేమో కానీ మెగా బ్రదర్స్ లిస్టులోకి వచ్చేది మాత్రం చిరంజీవి - నాగబాబు - పవన్ కళ్యాణ్ మాత్రమే అంటూ తేల్చేస్తున్నారు మెగా ఫ్యాన్స్ . దీంతో ఈ ఇష్యూ మరింత హిట్ పెంచేసినట్లయింది. చూడాలి మరి పవన్ కళ్యాణ్.. మెగా బ్రదర్స్ లో లిస్టులో చంద్రబాబుని యాడ్ చేయడం పట్ల ఎలా స్పందిస్తారో..???