అంతే కాదు ఈ సినిమా షూట్ ని కూడా ప్రారంభించేశారు . తాజాగా ఈ సినిమా షూటింగ్లో హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా పాల్గొన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఇప్పుడు సైలెంట్ గా మరొక ఇద్దరు స్టార్స్ ని రాజమౌళి షూటింగ్లో దింపేశాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు తాను తెరకెక్కించిన సినిమాల విషయంలో అన్ని ఓపెన్ గానే చెప్పుకొచ్చిన రాజమౌళి.. ఈ సినిమాను మాత్రం చాలా స్పెషల్ గా డైరెక్ట్ చేస్తున్నాడు . అందుకే పూజా కార్యక్రమాలని కూడా చాలా సీక్రెట్ గా ఎవరికి తెలియకుండా చేసేసారు. అయితే ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది .
అయితే ఇక్కడ కూడా చిత్ర బృందాన్ని తప్పిస్తే మిగతా ఎవరిని కూడా లోపలికి అలోవ్ చేయడం లేదట . కాగా ప్రజెంట్ మహేష్ బాబు - ప్రియాంక చోప్రాలపై కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నారట. అంతేకాదు సైలెంట్ గానే ఈ సినిమాలో జాన్ అబ్రహం అదే విధంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ని కూడా ఇన్వాల్వ్ చేసేసారట. ఇప్పుడు జాన్ అబ్రహం - అక్షయ్ కుమార్ లపై సీన్స్ షూట్ చేస్తున్నారట. ఈ నలుగురి కాంబోలో వచ్చేసి సీన్స్ సినిమాకి హైలెట్ గా మారబోతున్నాయి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి, అంతే కాదు తర్వాత షెడ్యూల్ ని ఏకంగా ఆఫ్రికా అడవుల్లో ప్లాన్ చేశాడట రాజమౌళి. అంతే కాదు ఆఫ్రికా అడవుల్లో మహేష్ బాబు - ప్రియాంక చోప్రాప్ పై ఒక రొమాంటిక్ సాంగ్ కూడా షూట్ చేయబోతున్నారట . దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వార్త బాగా ట్రెండ్ అవుతుంది. దాదాపు మూడేళ్లు గ్యాప్ తర్వాత రాజమౌళి సినిమాను స్టార్ట్ చేశారు . ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెంచేసుకున్నారు జనాలు..!