"సంక్రాంతికి వస్తున్నాం" సినిమా లో బుల్లి రాజు పాత్రలో మెరిసిన అబ్బాయికి సంబంధించిన నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాలో వెంకటేష్ - ఐశ్వర్య రాజేష్ - మీనాక్షి చౌదరి ల కన్నా కూడా హైలెట్ గా మారింది బుల్లి రాజు పాత్ర . ఈ పాత్రలో కనిపించిన అబ్బాయి పేరు "రేవంత్". గోదావరి స్లాంగ్లో అదరగొట్టేసాడు . అయితే ఈ పాత్రలో మెరిసిన అబ్బాయి కొన్ని కొన్ని బూతు పదాలను వాడుతాడు. ఓటిటి చూసి చిన్న పిల్లాడు బాగా చెడిపోయాడు అనే క్యారెక్టర్ లో ఈ అబ్బాయి కనిపిస్తాడు . అయితే బుల్లి రాజు పాత్రపై థియేటర్లో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించిన.. అతడి నోటి నుండి వచ్చిన కొన్ని బూతు పదాలను మాత్రం సహించలేకపోయారు .
అనిల్ రావిపూడి ని తప్పుపడుతూ అంత చిన్న పిల్లాడి చేత ఇలాంటి మాటలు ఎలా మాట్లాడిస్తారు అంటూ ట్రోల్ చేశారు . దానిపై అనిల్ రావిపూడి కూడా స్పందించారు. "మా ఫ్రెండ్స్ కూడా కొందరు ఈ ప్రశ్న నన్ను అడిగారు . నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను . మేము ఆ పాత్రతో చిన్న సందేశం ఇవ్వలి అనుకున్నాం. పెద్దల పర్యవేక్షణ లేకుండా పిల్లలు ఓటీటీ కంటెంట్ చూస్తే ఎలా మారిపోతారు ..? ఎలా తప్పుదోవపడతారు ..? అన్నదానికి ఇదొక ఎగ్జాంపుల్ . ఇంగ్లీష్ - హిందీ వెబ్ సిరీస్లకు తెలుగు అనువాదాలు చూసారంటే దారుణమైన బూతులు ఉంటాయి. వాటిని వినలేము.. చూసి తట్టుకోలేం.. అలాంటివి పిల్లలు చూడకూడదని చెప్పడమే మా ఉద్దేశం. సిగరెట్ తాగితే ఎంత ప్రమాదమో చెప్పే యాడ్లో కూడా సిగరెట్ తాగి చూపిస్తారు . అంత మాత్రాన సిగరెట్ తాగండి అని ప్రమోట్ చేయడం కాదు కదా.. ఇది కూడా అంతే "అంటూ తన వర్షెన్ ని వినిపించాడు. అయితే అనిల్ రావిపూడి ఇలా క్లారిటీ ఇవ్వడంపై కూడా కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. హిట్ కొట్టాడు అని హెడ్ వెయిట్ పెరిగింది అంటూ నెగిటివ్ గా ట్రోళ్ చేస్తున్నారు . దీనితో అనిల్ రావిపూడి సమస్యలని కొని తెచ్చుకున్నట్లయింది అంటున్నారు జనాలు..!