మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు సీనియర్ హీరోలలో చిరంజీవి మాత్రమే ఆ రికార్డును సొంతం చేసుకున్నారు .. ప్రజెంట్ ఫామ్ లో ఉన్న బాలయ్యకి కూడా ఆ రికార్డు సాధ్యం కాలేదు .. అక్కినేని హీరో నాగార్జున కనీసం ఈ రికార్డు దగ్గరలో కూడా రాలేకపోతున్నాడు .. విక్టరీ వెంకటేష్ మాత్రం సడన్గా ఊహించిన విధంగా ఈ రేస్ లోకి వచ్చేసాడు .. ఎవరు ఎప్పుడు అనుకోని విధంగా మెగాస్టార్ రికార్డుకే ఎసరు పెట్టేసాడు .. ఇంతకీ ఆ రికార్డు ఏమిటి అనేది ఈ స్టోరీలో చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బాక్సాఫీస్ దగ్గర వెంకటేష్ రికార్డ్ స్థాయిలో ప్రభంజనాలు చూస్తుంటే .. ఒక్కసారిగా అందరి కళ్ళు బైర్ల కుమ్ముతున్నాయి .. సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.


అసలు ఈ రేంజ్ లో వెంకటేష్ సినిమాకు కలెక్షన్లు వస్తాయా అని దిల్ రాజు , అనిల్ రావిపూడి సైతం ఎప్పుడు ఊహించి ఉండరు .. కేవలం ఐదు రోజుల్లోనే 160 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టింది .. అలాగే మొదటి వారం పూర్తయ్యలోపే డబల్ సెంచరీ కొట్టేలా ఉన్నాడు వెంకీ మామ. మన సీనియర్ హీరోల్లో 200 కోట్లు కలెక్షన్లు రాబట్టిన ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి .. ఆరు సంవత్సరాల క్రితం సైరా సినిమాతో మొదటిసారిగా 200 కోట్ల కలెక్షన్లు రాబట్టారు చిరంజీవి .. కమర్షియల్ గా సైరా సినిమా ప్లా ఫైన .. 250 కోట్లకు పైగా గ్రాఫ్ కలెక్షన్లు రాబట్టింది ..


అలాగే గతంలో సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాతో మరోసారి డబల్ సెంచరీ కొట్టాడు మెగాస్టార్.. ఈ సినిమా కూడా 235 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అఖండ సినిమా తర్వాత బాలయ్య 2.0 చూపిస్తున్న నట‌సింహం .. తాను చేస్తున్న ప్రతి సినిమాలు 100 కోట్ల దగ్గరే ఆపేస్తున్నారు .. ఎఫ్2 , ఎఫ్3 సినిమాలతో 100 కోట్లు రాబెట్టిన వెంకి మామ . ఇప్పుడు సంక్రాంతి వస్తున్నాం సినిమాతో 200 కోట్లు కలెక్షన్ అందుకోబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా దూకుడుచూస్తుంటే 300 కోట్లు రాబట్టిన ఆశ్చర్యపోవక్కర్లేదని కూడా అనిపిస్తుంది .. అనిల్ రావిపూడి బ్రాండ్ వెంకటేష్ ఇమేజ్ కలిసి సంక్రాంతికి వస్తున్నాం సినిమాని ఊహించిన విధంగా బ్లాక్ బాస్టర్ గా నిలబెట్టాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: