తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి రోజురోజుకీ పెరుగుతున్న క్రమంలో ఆర్భాటాలు .. హంగులు కూడా భారీగా పెరుగుతున్నాయి .. పెద్ద సినిమాలు వస్తున్నాయి అంటే చాలు ఆ సినిమాల ప్రమోషన్లలో నిర్మాతలు ఊహించని రేంజ్ లో హంగులు చేస్తూ .. తర్వాత లేనిపోని ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు .. ప్రధానంగా పుష్పా2 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మీద యాంకర్ సుమ నోట ఒకే మాట సినిమా విడుదలకు ముందే 1000 కోట్ల బిజినెస్ చేసిన సినిమా అంటూ .. అప్పట్లోనే అక్కడున్న సినిమా జనాలు గుసగుసలు ఆడుకున్నారు .. ఆదాయపు పన్ను శాఖవారిని రా రమ్మని కావాలని దగ్గరకు పిలుస్తున్నట్టు ఉంది  ఆమె అనౌన్స్మెంట్ అని .. అయితే ఇలా అనౌన్స్మెంట్ చేయడం నిర్మాతలకు ఇష్టం లేదు ..


 కానీ హీరో ఒత్తిడి మేరకు ఇలా చేయక తప్పలేదు. సినిమా రిలీజ్ తర్వాత ఏ స్థాయిలో హిట్ అయింది అన్నది పక్కన పెడితే.   ఈ సినిమా కలెక్షన్ల పోస్టర్ల హడావుడి గట్టిగా మొదలైంది .. రోజుకొక అప్డేట్ అంటూ పోస్టర్ల మీద పోస్టర్లు 100 కోట్లు వేల కోట్లు అంటూ రిలీజ్ చేశారు .. ఇక దాంతో ఇన్కమ్ టాక్స్ , జిఎస్టి దృష్టిని వారు గట్టిగా ఆకర్షించడం తప్ప ఇంకేం ఉండదు. అలాగే అభిమానుల కోసం సినిమాను మరింత ముందుకు తీసుకు వెళ్ళటం కోసం ఈ పోస్టర్ల పబ్లిసిటీ అనేది ఇప్పుడు కామన్ గా మారిపోయింది .. ఇప్పుడు ఇదే నిర్మాతలకు పేకల మీదకు తెస్తుంది .  


అంతేకాకుండా నిర్మాతలు పలు ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు కూడా ఆదాయప‌న్ను  శాఖ వారు సీరియస్గా తీసుకుంటున్నారు. ప్రెసెంట్ టాలీవుడ్ లో ఇదే జరుగుతుంది .. దాదాపు 100 మందికి పైగా ఆదాయపు పన్ను బృందాలు తెలుగు చిత్ర పరిశ్రమ మీదకు దాడికి దిగాయి .. పుష్ప 2 నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ మీదబ‌, సంక్రాంతికి వస్తున్నాం సినిమా నిర్మాణ సంస్థ దిల్ రాజు సంస్థల మీద .. వీటితో పాటు అనుబంధంగా ఉన్న మ్యాంగో మీడియా మీద కూడా ఈరోజు ఉదయం నుంచి భారీ ఎత్తున ఐటీ దాడులు మొదలయ్యాయి .. ఇప్పుడు ఈ దాడులు కనీసం నాలుగు రోజులబ పాటు వీరి మీద జరుగుతాయని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: