తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సందీప్ రెడ్డివంగ ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని కూడా తీసుకొచ్చి పెట్టాయి.ఈ క్రమంలోనే పాన్ ఇండియన్‌ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్‌లో స్పిరిట్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పనులు జోరుగా సాగుతున్నాయి.స్క్రిప్ట్ లాక్ చేసిన సందీప్.. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్నాడు. తను రాసుకున్న కథతో ఎలాంటి నటీనటులనైనా కన్విన్స్ చేసి.. దానిపై పూర్తిగా దృష్టి పెట్టి పనిచేయడం సందీప్‌కు అలవాటు. తన టెక్నికల్ టీం ఇప్పటికే ఫిక్స్ అయిపోయారని.. ఇక కాస్టింగ్ ఎంపిక చేసుకునే పనిలో సందీప్ బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది.ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు లీక్ అయింది. సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ తీసుకోవాలని ప్రయత్నాల్లో ఉన్నాడట సందీప్. ఇప్పటికే వరుణ్‌తో చర్చలు జరిపినట్లు తెలుస్తుది. అయితే వరుణ్ తేజ్ మాత్రం ఇప్పటివరకు తన నిర్ణయాన్ని చెప్పలేదని.. కానీ మెగా కాంపౌండ్ నుంచి పాజిటివ్ సైన్స్ వస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే స్పిరిట్‌లో వరుణ్ నెగటివ్ రోల్‌లో కనిపించనున్నాడని టాక్‌ నడుస్తుంది. హీరో పాత్రకు చాలా ధీటుగా ఈ రోల్‌ని రాసుకున్నాడట సందీప్. ఇక.. ఈయన సినిమాల లో హీరో, విలన్ పాత్రలకు ఎంత బలాన్ని చేకూరుస్తాడో ప్రత్యేకం గా చెప్పనవసరం లేదు.ఇక వరుణ్ ఈ సినిమాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా.. లేదా.. చివరి చర్చలు పూర్తయితే గాని తెలియదు. కానీ.. ఈ మూవీ ఒప్పుకొని వరుణ్‌ నటిస్తే మాత్రం.. ఇక మెగ, రెబల్ అభిమానులకు పూనకాలే అనడంలో అతిశయోక్తి లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: