గత ఐదు సంవత్సరాలుగా విజయాలు అయితే ఇస్తున్నారు కానీ ఒక్క సినిమాను కూడా చెప్పిన డేట్‌కి తీసుకు రాలేకపోతున్నాడు ప్రభాస్. రాజా సాబ్ సినిమా విషయంలోను ఇదే కంటిన్యూ చేస్తున్నాడు .. గతంలో 2024 సమ్మర్ కు రిలీజ్ అన్నారు.. తర్వాత 2025 సంక్రాంతికి.. ఇప్పుడు ఏప్రిల్ 10 అంటున్నారు .. ఏప్రిల్ కూడా డౌటే అన్ని కూడా అంటున్నారుడ.. ప్రస్తుతం జులై 18 లేదా ఆగస్టు ఈ రెండు నెలల్లో ఒకరోజు రాజా సాబ్ రిలీజ్ కానుందని టాలీవుడ్ సర్కిల్స్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఒక్క ప్రభాస్ మాత్రమే కాదు .. పవన్ కళ్యాణ్ కూడా కేరాఫ్ వాయిదాల హీరోగా మారిపోతున్నాడు .. ఈయన రాజకీయాల్లో బిజిగా మారుతున్న కారణంగా ఏ సినిమాని కూడా చెప్పిన డేట్‌కు తీసుకు రాలేకపోతున్నాడు ..
మార్చ్ 28 న హరిహర వీరమల్లు పక్క అన్నారు .. కానీ ఇప్పుడు ఆ టైం కి రావడం కష్టమే అని అంటున్నారు .. ఇక ఇప్పుడు అదే రోజు నితిన్ రాబిన్ హుడ్ సినిమా రిలీజ్ కానుంది .. ఇప్పుడు చూస్తూ చూస్తూ తన దైవం పవన్ తో నితిన్ పోటీకి రాడు కదా .. అక్కడున్నది movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు. అలాగే మార్చ్ 29న మ్యాడ్ స్క్వేర్ రానుంది .. ఈ లెక్కన విజయ్ దేవరకొండ 12వ సినిమా కూడా మార్చి 29 నుంచి పోస్ట్ పోన్ అయ్యిందని కూడా అంటున్నారు .. ఈ రెండు సినిమాలను ప్రొడ్యూస్ చేస్తుంది సితార ఎంటర్టైన్మెంట్స్ .. ఓకే బ్యానర్ లో వస్తున్న ఒక్కరోజు గ్యాప్ లో రెండు సినిమాలయితే రిలీజ్ చేయరు కదా .. అయితే దీనిబట్టి విజయ్ దేవరకొండ 12వ సినిమా మరో డేట్‌కు పోస్ట్ పోన్ అయిందని మాట. ఈ సంక్రాంతికి వాయిదా పడ్డ చిరు విశ్వంభర, రవితేజ మాస్ జాతర సినిమాలకు ఇంకా రిలీజ్ డేట్స్ కన్ఫామ్ కాలేదు.. ఇలా టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు ఊహించని విధంగా వాయిదాలు పడుతూ వస్తున్నాయి.