ఈమూవీ కలక్షన్స్ జోరును పరిశీలిశునన వారు ఈ స్పీడ్ వారాంతం వరకు కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది. ఈ పరిస్థితులు ఇలా ఉండగా ఈమూవీ ఘన విజయం ఇండస్ట్రీకి కొత్త పాఠాలు నేర్పిస్తోంది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం సంక్రాంతికి వచ్చే సినిమాలలో ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ ఉన్న సినిమాలనే సగటు ప్రేక్షకుడు బాగా ఆదరిస్తున్నాడు అభిప్రాయాలు బాగా వ్యక్తం అవుతున్నాయి.
దీనికి కొన్ని ఉదాహరణాలు కూడ విశ్లేషకులు ప్రచారంలోకి తీసుకు వస్తున్నారు. కోవిడ్ రాకముందు అప్పటి సంక్రాంతికి విడుదలైన మూవీ ‘అల వైకుంఠ పురములో’ మూవీ రికార్డుల పరంగా కలక్షన్స్ వసూలు చేసిన విషయం తెలిసిందే. పూర్తి ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ మూవీగా అప్పట్లో విడుదలైన ఆమూవీని ప్రేక్షకులు ఒకటికిరెండు సార్లు చూశారు. ఈసినిమా కంటే ముందుగా మరొక సంవత్సరం విడుదలైన ‘ఎఫ్ 2’ ఆరోజులలో కలక్షన్స్ పరంగా ఒక రికార్డును క్రియేట్ చేసింది.
గత సంవత్సరం విడుదలైన మహేష్ త్రివిక్రమ్ ల ‘గుంటూర్ కారం మూవీకి టాక్ పరంగా మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ ఆమూవీ కలకన్స్ బాగానే రావడం చాలామందిని ఆశ్చర్య పరిచిన విషయం గత సంవత్సరంసంక్రాంతి భారీ సినిమాల మధ్య పోటీగా విడుదలైన ‘జై హనుమాన్’ ఊహించని ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇలా గత కొన్ని సంవత్సరాలుగా సంక్రాంతికి విడుదల అవుతున్న ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు ఘన విజయం సాదిస్తున్న పరిస్థితులలో ఇండస్ట్రీకి ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు కొత్త పాఠాలు నేర్పిస్తున్నాయి అంటూ కొందరు విశ్లేషణలు చేస్తున్నారు..