రాజమౌళి లాంటి భారీ సినిమాల దర్శకుడు తాను భారీ సినిమాలు తీయడానికి స్పూర్తి దర్శకుడు శంకర్ అంటూ ఈమధ్య ఓపెన్ గానే చెప్పాడు. ‘భారతీయుడు’ ‘రోబో’ లాంటి ఆలోచింప చేసే భారీ సినిమాలు తీసిన శంకర్ ప్రస్తుత పరిస్థితి చూసి ఆయన అభిమానులు కూడ నిట్టూర్పులు విడుస్తున్నారు.



గత పుష్కర కాలంగా శంకర్ నుండి వచ్చిన ఏసీనిమా కూడ కనీసం హిట్ టాక్ ను తెచ్చుకోలేక పోవడంతో రానున్న కాలంలో శంకర్ చెప్పిన కథను నమ్మి నిర్మాతలు హీరోలు ముందుకు వస్తారా అనే సందేహాలు అందరిలో ఉన్నాయి. భారీ సినిమాలను తీసే శంకర్ నిరంతరం ఆభారీ తనం గురించి ఆలోచిస్తున్నాడు కానీ తాను తీసే కథ విషయంలో ఏమాత్రం ఆలోచన చేయక పోవడంతో శంకర్ కు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.



గతంలో శంకర్ సినిమా అంటే కళ్ళు మూసుకుని ప్రేక్షకులు ఆసినిమా టాక్ గురించి పట్టించుకోకుండా ధియేటర్లకు వచ్చేవారు. దీనితో అతడి సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వచ్చేవి. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకపోవడంతో శంకర్ సినిమాలకు ఓపెనింగ్ కలక్షన్స్ రావడం లేడు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.



లేటెస్ట్ గా విడుదలై ఘోరమైన ఫ్లాప్ గా మారిన ‘గేమ్ చేంజ‌ర్’ సినిమాలో కేవ‌లం పాటల కోసం 75 కోట్లు ఖ‌ర్చు పెట్టిన‌ట్లు శంకర్ ఓపెన్ గానే చెప్పాడు. ఆసినిమా విడుదల అయ్యాక ఆసినిమాలోని పాటలను చూసిన ప్రేక్షయకులు ఇలాంటి ఖర్చుతో ఒక మంచి మీడియం రేంజ్ సినిమా తీయవచ్చు అంటూ పెదవి విరచారు. ‘ఇండియ‌న్-2’ ‘ఐ’ లాంటి సినిమాలను ఎందుకు తీశాడో కనీసం శంకర్ కు అయినా అర్థం అవుతుందా అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. గతంలో ఈ దర్శకుడుకు ఉన్న హిట్ ట్రాక్ రికార్డ్ వల్ల అతడితో సినిమాలు తీసిన నిర్మాతలు ఎన్ని కోట్లు అంటే అన్ని కోట్లు మంచి నీళ్ళు లా ఖర్చు పెట్టె వారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి శంకర్ కు ఉండకపోవచ్చు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: