తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి రోజు రోజుకు ఊహించని రేంజ్ కు వెళుతుంది .. భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు .. ఎప్పుడు తాజా గా ఓ అంతర్జాతీయ సంస్థ డిసెంబర్ 2024 వరకు ఇండియన్ చిత్ర పరిశ్రమలో మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ ఎవరూ అంటూ ఓ సర్వే చేయగా అందులో సౌత్ బ్యూటీ సమంత టాప్ లో నిలిచింది .. అంతేకాకుండా టాప్ 10 హీరోయిన్స్ ఎవరో అనేది కూడా ఇక్కడ తెలుసుకుందాం .


టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే .. అందం , అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం .. ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన ఈ బ్యూటీ . అతి తక్కువ కాలం లోనే స్టార్ డం అందుకుంది .. ఇండియన్ చిత్ర పరిశ్రమ లోనే మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టోర్స్ లో టాప్ 1న్ లో నిలిచింది . ఆ తర్వాత బాలీవుడ్ అందాల బ్యూటీ అలియా భట్ రెండో ప్లేస్ లో నిలిచింది .. ఈ ముద్దుగుమ్మ త్రిబుల్ ఆర్ సినిమాతో సౌత్ అభిమానులను పలకరించింది .


అలాగే భారతీయ చిత్ర పరిశ్రమ లో మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ ఎవరనేది ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా సంస్థ నిర్వహించిన సర్వే లో మూడో స్థానంలో స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే ఉంది . అలాగే పుష్ప 2 సినిమా తో మంచి ఫామ్ లో ఉన్న రష్మిక మందన్న 4 ప్లేస్ లో నిలిచింది .. ఈ ముద్దుగుమ్మ వరస సినిమాలతో పాన్ ఇండియా లెవెల్ లో ఫుల్ బిజీగా ఉంది . మిగిలిన స్థానాల్లో సాయిపల్లవి ఐదవ స్థానంలో, త్రిష ఆరవ స్థానంలో, నయనతార ఏడవ స్థానంలో, కాజల్ అగర్వాల్ ఎనిమిదవ స్థానంలో, శ్రీలీల తొమ్మిదొవ స్థానంలో, శ్రద్ధాకపూర్ 10 వస్థానంలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: