అయితే డాకుమహారాజ్ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా యాంకర్ సుమతో ఒక చిన్న ఇంటర్వ్యూను కండక్ట్ చేశారు మూవీ టీం. ఇందులో బాలయ్య మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అంతేకాదు బాలయ్య మాటల్లో నిజం కూడా ఉంది అంటూ జనాలు మాట్లాడుతున్నారు. "నేను గోరంత దాన్ని కొండంత చేయను ..ఉన్నది ఉన్నట్లు చెబుతాను..అదే నాకు అలవాటు.. నా ఇంటి పక్కన షూటింగ్ జరుగుతున్నా సరే నేను ప్రొడక్షన్ వాళ్ళు పెట్టిన ఫుడ్ నే తింటాను.. ఆ అన్నం తినే ఇలా ధిట్టంగా ఉన్నాను.. సినిమా ఇండస్ట్రీ నాకు అన్నం పెడుతుంది.. ఆ అన్నాన్ని అవమానించను"..
" నేను ఏం సాధించానో అదే చెప్తాను .. ఉత్తినే అన్ని చెప్పేసుకోవడం నాకు నచ్చదు "అంటూ పరోక్షకంగా ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు కలెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువగా కలెక్ట్ చేసాము అంటూ హై ఓవరాక్షన్ చేస్తూ ఉండే విధానాని ఈ విధంగా తప్పుపట్టాడు బాలయ్య అంటున్నారు జనాలు. అంతేకాదు పరోక్షకంగా వర్తిస్తుంది అని ..గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు 186 కోట్లు అంటూ ఏ విధంగా చిత్ర బృందం డప్పు కొట్టుకుందో అందరికీ తెలిసిందే . అయితే అదంతా ఫేక్ కలెక్షన్స్ అంటూ చాలామంది క్లారిటీకి వచ్చారు. ఈ క్రమంలోనే బాలయ్య మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. పరోక్షకంగా రామ్ చరణ్ కి కౌంటర్ వేశాడు బాలయ్య అంటున్నారు జనాలు..!