ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఆదాయ పన్ను శాఖ అధికారులు మెరుపుదాడులు నిర్వహించిన విషయమే హైలెట్గా మారింది . మరీ ముఖ్యంగా టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇంటి పై అదేవిధంగా ఆఫీసులపై ఆదాయపన్ను  శాఖ అధికారులు మెరుపు దాడులు చేసిన విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఆల్మోస్ట్ ఆయన నివసిస్తున్న ఇంటితో సహా అన్ని ఆఫీసుల తో సహా ఏకకాలంలో ఈ దాడులు జరిగాయి.  సంక్రాంతి బరిలో ఆయన నిర్మించిన సినిమాలు నిలవడం ఇందుకు  కారణం అంటున్నారు జనాలు .


అంతేకాదు భారీ భారీ కలెక్షన్ లు సాధించింది అని డప్పు కట్టుకోవడం కూడా ఆయనకు నెగిటివ్గా మారింది అంటున్నారు జనాలు . అయితే కేవలం దిల్ రాజు ఒక్కడి పైనే కాదు . మరి కొంతమంది సినీ ప్రముఖుల ఇళ్లపై కూడా ఐటి  దాడులు జరిగాయి అంటూ తెలుస్తుంది . మరి ముఖ్యంగా మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని ఇంటిపై అదేవిధంగా ఆఫీస్ పై.. ఐటి రైడ్ జరిగినట్లు తెలుస్తుంది.  అదేవిధంగా పుష్ప2 మూవీ మేకర్స్ అయినా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారి ఆఫీసుల్లో కూడా ఐటి దాడులు జరిగినట్లు తెలుస్తుంది.



దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ ఐటి దాడులకు సంబంధించిన విషయాలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి . అయితే ఇలా ఉన్న పలంగా ఎందుకు ఒకేసారి సినీ ఇండస్ట్రీపై ఆదాయపు పన్ను శాఖ వాళ్ళు మెరుపు దాడులు చేశారు అంటే మాత్రం ఈ మధ్యకాలంలో సినిమా ప్రొడ్యూసర్స్ కలెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా కలెక్షన్స్ దక్కించుకున్నాయి అంటూ సినిమాలని ప్రమోట్ చేసుకున్న కారణంగానే ఇలా జరిగింది అంటున్నారు జనాలు.  దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ గా "గేమ్ ఛేంజర్" సినిమాను చూపిస్తున్నారు. రామ్ చరణ్ నటించిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చిన సరే 186 కోట్లు వసూళ్లు చేసింది అంటూ ప్రచారం చేయడమే దీనికి మెయిన్ కారణం అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. లేనిపోని డప్పు కొట్టుకొని ఇలాంటి దాడులు జరిగేలా చేసుకున్నారు అంటూ కామన్ పీపుల్స్ కూడా మండిపడుతున్నారు . కొంతమంది వీళ్ళకి ఇలా కావాల్సిందే అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: