ఇటీవలే బాలకృష్ణ తన సొంత నియోజకవర్గంలో హిందూపురంలో పర్యటించిన బాలయ్య..తమ అభిమాన కార్యకర్త మరణించిన వార్త తెలియడంతో తీవ్ర బాగోద్వేగానికి గురై ఆ బాధిత కుటుంబాలను పరామర్శించారట బాలయ్య. అసలు విషయంలోకి వెళ్తే స్థానికంగా టిడిపి నాయకుడుగా పేరుపొందిన వెంకటస్వామి అనే కార్యకర్త మరణించారట. ఈ విషయం తెలిసిన వెంటనే బాలయ్య ఆ నాయకుడు ఇంటికి వెళ్లి మరి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పిస్తూ ఎమోషనల్ గా మాట్లాడుతూ కుటుంబాన్ని పరామర్శించడం జరిగిందట. అలాగే కుటుంబానికి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా అండగా ఉంటానని భరోసా కూడా ఇచ్చారట బాలయ్య.
ప్రస్తుతం బాలయ్య చిత్రాల విషయానికి వస్తే.. బోయపాటి శ్రీను తో అఖండ 2 చిత్రంలో మాత్రమే నటిస్తూ ఉన్నారు.. ఈ చిత్రంలో కూడా డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే హీరో హీరోయిన్స్ ఎవరిని విషయం తెలియదు కానీ ఈ సినిమా షూటింగ్ను కూడా ఇటీవలే కుంభమేళాలో మొదలుపెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవలే లొకేషన్స్ కోసం బోయపాటి శ్రీను ఏపీలో కూడా పలు ప్రాంతాలలో సర్చింగ్ చేస్తున్నట్లుగా సమాచారం. అలాగే బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభించాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడింది.. మరి ఎప్పుడూ ఉంటుందో చూడాలి.