సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ రావాలి అంటే చాలామంది యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకొని బాడీ ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. వారికి సినిమా ఇండస్ట్రీలో చిన్న ఛాన్స్ కూడా దొరకని పరిస్థితులు ఉంటాయి.. అలా ఇండస్ట్రీలో సినిమా ఛాన్స్ ల కోసం తిరిగి తిరిగి జీవితాలు నాశనం చేసుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. ఇదంతా ఒకప్పటి మాట అయితే  ప్రస్తుత కాలంలో చాలామంది సోషల్ మీడియా ద్వారానే స్టార్స్ అయ్యి సినిమాల్లో ఆఫర్లు పొందుతున్నారు.. వారిలో ఉన్న టాలెంట్ ను సోషల్ మీడియా వేదికగా బయట పెడుతూ దర్శక నిర్మాతల కంట్లో పడి చివరికి సినిమా ఆఫర్లు పొందుతూ దూసుకెళ్తున్నారు.. అలా సోషల్ మీడియా ద్వారా ఆఫర్లు అందుకున్న హీరోయిన్స్ ప్రభాస్ ఫౌజి మూవీ హీరోయిన్ ఇమాన్వి, అలాగే ఆర్జీవి బ్యూటీ  ఒకరు. ఆమె చీరకట్టులో అద్భుతంగా కనిపించడంతో శారీ అనే సినిమా ద్వారా ఆరాధ్య దేవిని తెరకు పరచయం చేశారు ఆర్జీవి.. 

ఇక ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియా అంటే ఏంటో తెలియదు. ఆమె చేతిలో ఫోన్ కూడా లేదు.. మహా కుంభమేళలో రుద్రాక్షలు అమ్ముకొని బ్రతికే ఒక అమ్మాయి ప్రస్తుతం సోషల్ మీడియానే షేక్ చేసి ట్రెండింగ్ గా మారింది.దేశవ్యాప్తంగా ఆమె ఫొటోస్ మీడియాలో టాప్ పొజిషన్లో ఉన్నాయి.. చూడటానికి ఎంతో అందంగా ఇన్నోసెంట్ ఫేస్ తో, మిరుమిట్లు గొలిపే తేనేకళ్లు, ఎలాంటి మేకప్ లేకుండా న్యాచురల్ గా చూడగానే అట్రాక్ట్ అయ్యే విధంగా ఉంది ఈ అమ్మాయి.. ఆమె ఎవరు ఆ వివరాలు ఏంటో చూద్దాం.. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ అందాల బ్యూటీ పేరు మోనాలిసా.. ఆమె పేరుకు తగ్గట్టే అందంగా ఉంది. కుంభమేళలో దండలు అమ్ముకుంటుంటే ఆమెను చూసినటువంటి భక్తులు ఆమె ఫొటోస్ వీడియోస్ రికార్డు చేసి ఆమె ఫోటోలు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంతో విపరీతంగా వైరల్ అయింది. 

సోషల్ మీడియా ద్వారా ఆమె అందాన్ని చూసినటువంటి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెకు సినిమా ఆఫర్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఆమె అందం అమాయకత్వం చూసిన ఆయన తాను తీయబోయే డైరీ ఆఫ్ మణిపూర్ చిత్రంలో పర్ఫెక్ట్ హీరోయిన్ గా సెట్ అవుతుందని భావిస్తున్నారట. త్వరలోనే ఆమెను కలిసి ఆమెకు యాక్టింగ్ స్కిల్స్ నేర్పించి సినిమాలో హీరోయిన్ గా తీసుకోబోతున్నానని చెప్పారు. ఈ విధంగా సోషల్ మీడియా ద్వారా మోనాలిసా జీవితం మారిపోతుందని చెప్పవచ్చు. మరి ఈ డైరెక్టర్ ఇచ్చిన ఆఫర్ కు ఆ అమ్మాయి ఒప్పుకొని  సినిమాల్లోకి వస్తుందా లేదంటే నాకెందుకులే అని సైలెంట్ గా ఉంటుందా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: