- ఇంకా సేల్ కాని విశ్వంభ‌ర ఓటీటీ రైట్స్ .. !

- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


ప్రస్తుతం మెగా హీరోల అభిమానులు ఒక సాలిడ్ హిట్ కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూపులు చూస్తున్నారు. రీసెంట్ గాన్ వచ్చిన పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్ ఊహించని విధంగా పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. అస‌లు ఈ సినిమా మామూలు ప్లాప్ కాదు.. రామ్ చ‌ర‌ణ్ ప‌రువు తీసేసింది. నిజంగా మెగా అభిమానులు ఎవ్వ‌రూ కూడా త్రిబుల్ ఆర్ త‌ర్వాత ఇంత పెద్ద ప్లాప్ సినిమా చ‌ర‌ణ్ నుంచి వ‌స్తుంద‌ని ఊహించ‌నే లేదు. ఇక ఇప్పుడు మెగా అభిమానుల ఆశ‌లు అన్నీ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వ‌స్తోన్న “ ఓజి ” , “ హరిహర వీరమల్లు ” సినిమాల మీదే ఉన్నాయి.


వాస్త‌వానికి పవన్ సినిమాల్లో ఓజి సినిమా గత ఏడాది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన “ దేవర ” రిలీజ్ డేట్ లో రావాల్సి ఉన్నా కూడా అది సాధ్యం కాలేదు. అయితే అపుడు ఓటిటి డీల్ ముగియపోకపోవడం తో ఆ డేట్ నుంచి మేకర్స్ తప్పుకున్నట్టుగా టాక్ వచ్చింది. అయితే ఇపుడు ఇదే తరహాలో పవన్ సోదరుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ ఫాంటసీ వండర్ సినిమా “ విశ్వంభర ” పరిస్థితి కూడా ఉన్నట్టు టాలీవుడ్ ట్రేడ్ స‌ర్కిల్స్ లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంకా పెండింగ్ ప‌నులు చాలానే ఉన్నాయ‌ని.. ఓటీటీ డీల్ కూడా అనుకున్న ఫిగ‌ర్ కు వెళ్ల‌క పోవ‌డంతో విశ్వంభ‌ర రిలీజ్ ఇప్ప‌ట‌కీ అయితే స‌స్పెన్సే అంటున్నారు. ఏదేమైనా ఇది మెగా స్టార్ రేంజ్‌కు నిజంగా అవ‌మానం లాంటిదే. మ‌రి ఈ సినిమా ఓటీటీ డీల్ ఎప్ప‌ట‌కి ముగుస్తుందో ?  ఎప్ప‌ట‌కి రిలీజ్ అవుతుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: