ఇండియన్ దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. రీసెంట్ గానే మైసూర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించుకుంది .. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది .. గతంలో గేమ్ చేంజర్ ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ ఈ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ ఇచ్చాడు .. అయితే ఇప్పుడు ఈ నెల 27 నుంచి ఈ సినిమా షూటింగ్ మరో షెడ్యూల్ ను హైదరాబాదులో వేసిన ఓ ప్రత్యేక సెట్ లో ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. భారీ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ కథతో రాబోతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ వైవిధ్యంగా ఉంటుందని .. అలాగే ఈ సినిమాలో హీరో ఒక క్రీడాకారుడుగా కనిపిస్తారని తెలుస్తుంది ..
అయితే ప్రస్తుతం ఆర్‌సీ 16 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి గత కొంతకాలంగా పెద్ది అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు చిత్ర యూనిట్ .. అయితే ఇప్పుడు ఈ సినిమాకి పెద్ది అనే టైటిల్‌ను కన్ఫామ్ చేసినట్టు టాలీవుడ్ విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అలాగే ఈ సినిమాకి ఈ టైటిల్ పెట్టడానికి కూడా కథలో ఓ బలమైన అంశం కూడా కారణమైందట .. అలాగే ఈ టైటిల్ మాస్ గా పవర్ ఫుల్ గా కూడా ఉండటంతో సినిమా యూనిట్ కూడా ఇదే టైటిల్ కి ఓకే చెప్పారని తెలుస్తుంది. మార్చ్‌లో రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు ఓ గ్లింప్స్‌ను కూడా విడుదల చేసే ఆలోచనలు చిత్ర యూనిట్ ఉంది. రామ్ చరణ్ - బుచ్చిబాబు సినిమాతో అయిన బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి సక్సెస్ ట్రక్ లోకి వస్తడో లేదో చూడాలి.