దీంతో తెలుగు సినిమా చరిత్రలో ఈ పండగ సీజన్లో వచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్ సక్సెస్ సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం పేరు తెచ్చుకుంది .. అలాగే అమోరికా లో కూడా ఈ సినిమా 2.3 మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్ సాధించింది .. వెంకటేష్ - అనిల్ రావిపూడి - దిల్ రాజు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా కలెక్షన్ల రికార్డులను కొల్లగొడుతుంది .. హాట్రిక్ కాంబో మరోసారి బాక్స్ ఆఫీస్ దగ్గర తమ సత్తా చాటుకుంది .. ఈ సినిమాలకు ముందు ఎఫ్2 , ఎఫ్3 సినిమాలతో కూడా ఈ కాంబో మంచి లాభాలు అందుకుంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో కూడిన స్టోరీ తో పాటు వెంకటేష్ తన పాత్రలో చూపించిన అద్భుతమైన నటన ఈ సినిమాకు ముఖ్య ఆకర్షణంగా నిలిచింది.
పండగ సందడి , ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే కంటెంట్ సినిమాకు మరింత బలాన్ని ఇచ్చాయి .. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి భారీగా వస్తున్న క్రేజ్ ను చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ మూవీ మరిన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకోవటం ఖాయమనిపిస్తుంది. ఈ సంక్రాంతి సెలవుల్లో ప్రేక్షకులను మెప్పించి కుటుంబ సమేతంగా థియేటర్లకు రప్పించిన ఈ సినిమా ఈ పండగ సీజన్లో టాలీవుడ్ బాక్సాఫీస్ కు సరికొత్త బూస్ట్ ని ఇచ్చింది. అదేవిధంగా ఒక రీజినల్ లాంగ్వేజ్ లో అత్యధిక కలెక్షన్ అందుకున్న సినిమాగా కూడా టాప్ ప్లేస్ లో నిలిచింది. అయితే ఇంతకుముందు ఈ రికార్డ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమా తన ఖాతాలో వేసుకుంది .. ఈ సినిమా 180 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది .. ఇక ఇప్పుడు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నానం ఈ లెక్కను ధాటి 200 కోట్లకు పైగా గ్రాస్ ను తన ఖాతాలో వేసుకోవటం విశేషం .. ఇక మరి ఇప్పుడు ఇదే జోష్లో ఈ వారంలో కూడా కొనసాగితే ఈ సినిమా 300 కోట్ల మార్కక్‌ను టచ్ చేయటం కూడా ఎంతో ఈజీ అని చెప్పవచ్చు.