టాలీవుడ్ లో సంవత్సరాలు మారుతున్న వరుస వివాదాలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి .. మొన్నటి వరకు సంధ్య థియేటర్ తొక్కిస‌లాట ఘటనతో టాలీవుడ్‌లో హ‌ట్ టాపిక్‌గా  మారిన తెలుగు చిత్ర పరిశ్రమ .. ఆ తర్వాత ఊహించని గ్యాపులోనే మోహన్‌ బాబు ఫ్యామిలీ గోడ‌వ‌ తో చిత్ర పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా షేక్ అయింది .. ఇప్పుడు ఈ వివాదాల పరంపర కొత్త సంవత్సరంలో కూడా కొనసాగుతూనే ఉంది .. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఈరోజు ఉదయం నుంచి ఐటీ దాడులు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మొదటిలో కేవలం దిల్ రాజు ఆఫీస్ లో ఆయన ఆస్తులపై మాత్రమే  ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులను నిర్వహిస్తున్నారని అంతా భావించారు .  కానీ చివరకు చూస్తే 55 కి పైగా బృందాలు టాలీవుడ్ పై ఒక్కసారిగా పడ్డాయి. ఒక దిల్ రాజు ఆఫీసులతో మాత్రమే కాకుండా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ ఆఫీసులు , అభిషేక్ అగర్వాల్ ఆఫీసులపై కూడా ఏకతాటిగా దాడులు చేస్తున్నాయి ..


ఇక వీరందరితో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు ముఖ్య ఫైనాన్సర్ గా కొనసాగుతున్న సత్య రంగయ్య ఆఫీసులో నివాసాలపై కూడా ఈ దాడులు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు కేవలం వీళ్ళ  మీద మాత్రమే కాకుండా .. వీరికి సన్నిహితంగా ఉండే వ్యక్తులపై కూడా ఈ దాడులు జరగటం ఇప్పుడు టాలీవుడ్ లో ఒక కొసమెరుపు .. మైత్రి మూవీ సినిమాల విషయంలో ఎంతో కీలకంగా ఉండే ఓ వ్యక్తి ఇంటిపై కూడా ఈ దాడులు జరుగుతున్నాయి .. అలాగే దిల్ రాజుకు వ్యాపార భాగస్వామిగా ఉంటున్న మ్యాంగో రామ్ ఆఫీస్ , నివాసం పై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి.ఈ సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు వచ్చిన గేమ్ చేంజర్ ,సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు భారీ స్థాయిలో లాభాలు వచ్చినట్టు పోస్టర్లు రిలీజ్ చేశారు .. అదేవిధంగా కొన్ని పీఆర్ టీమ్స్ ద్వారా కొందరు కావాలని ఫేక్ నెంబర్స్‌ తో కలెక్షన్లు పెంచుతూ పోస్టర్లు వేస్తున్నారు .. ఇలాంటి ఆధారాలను ఆధారంగా ఐటీ దారులు జరుగుతున్నట్టు మొదట్లో పలు వార్తలు బయటికి వచ్చినప్పటికీ .. మొత్తంగా ఇప్పుడు చూసుకుంటే ఆదాయపు పన్ను శాఖ అధికారులు పక్క వారికి వచ్చిన సమాచారంతో ఓ వ్యూహంతోనే దాడికి దిగినట్టు స్పష్టంగా తెలుస్తుంది ..


అయితే ఇప్పుడు ఈ దాడుల్లో భాగంగా దిల్ రాజు భార్యను ఇప్పటికే బ్యాంకులకు తీసుకెళ్లి ఆమెతో పలు లాకర్లను ఓపెన్ చేయించి ఆస్తులు గుట్టు విప్పుతున్నారు అధికారులు .. అసలు ఏం జరగలేదని ఐటీ అధికారులు మామూలుగానే వచ్చారని దిల్ రాజు భార్య మీడియాతో చెప్పినప్పటికీ . ఇక‌ ఇప్పుడు తాజా ఐటి దాడుల వ్యవహారం చూస్తుంటే  ఇండస్ట్రీలో ఇంకేదో ఉహించ‌న‌ది జరుగుతుందని అనుమానాలు కూడా బయటికి వస్తున్నాయి.  అంతేకాకుండా అటు దిల్ రాజు సోదరుడు , కూతురు నివాసాలపై కూడా ఈ దాడులు జరుగుతున్నాయి . ఈరోజు రాత్రి వరకు ఈ సోదాలు జరుగుతాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: