ఇక అప్పట్లో నేను షూటింగ్ సెట్లో నా పనిపై ఎంతో ఫోకస్ పెట్టేవాడిని .. అందుకే ఆ రోజుల్లో హీరోయిన్లు నన్ను బ్రేక్ అడగడానికి కూడా ఎంతో ఇబ్బంది పడేవారు .. హిందీలో నా మొదటి హీరోయిన్ రేఖ అయినా కూడా నా దర్శకత్వంలో శ్రీదేవి 14 సినిమాలు వరకు నటించిందని ఆయన చెప్పకు వచ్చారు. అదేవిధంగా శ్రీదేవి తెలుగులో సినిమాలు చేసే సమయంలో వారి తల్లి గారి ప్రభావం ఎక్కువగా కనిపించేది .. బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత కూడా ఆమె ఎక్కువగా రేఖ సలహాలను తీసుకుంటూ ఉండేది ..
అలాగే వీరిద్దరి మధ్య మంచి స్నేహం సంబంధం కూడా కొనసాగింది .. మిథున్ చక్రవర్తితో పెళ్లి జరిగింది కానీ అతను ఆమె కెరియర్ గురించి ఆలోచించి ఆమెను బయటికి పంపేశాడు .. ఆ తర్వాత ఊహించిని విధంగా బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ ను రెండో పెళ్లి చేసుకుంది .. అలా ఆమె ఫ్యామిలీ లైఫ్ లో ఎంతో హ్యాపీగా గడుపుతున్న ఆమె మరణం మాత్రం సహజమైంది కాదని అందరూ అంటారు .. కొన్ని విషయాలో ఆమెకి చాలా అన్యాయం జరిగిందని ఆ ఇంటర్వ్యూలో కె బాపయ్య చెప్పుకొచ్చారు . ప్రస్తుతం ఈ సీనియర్ దర్శకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.