కాగా, పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమా గతంలోనే సంధ్య 70 ఎం ఎం థియేటర్ లో కోటి 58 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను రాబట్టి సంచలనం సృష్టించింది. అలాంటి రికార్డుని పుష్ప-2 సినిమా గత నెలలో తిరగరాసింది. ఇప్పుడు 16 ఏళ్ల జూనియర్ ఎన్టీఆర్ రికార్డును కూడా బద్దలు కొట్టబోతోంది. ఈ సినిమా 2007 సంవత్సరంలో విడుదలైన ఎన్టీఆర్ యమదొంగ సినిమా 400 కేంద్రాలలో అర్థ శతదినోత్సవాన్ని జరుపుకుంది. ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరు అందుకోలేకపోయారు.
ఓటీటీ యుగం ప్రారంభమైన అనంతరం అసలు థియేటర్లలో 50 రోజులు, 100 రోజుల రికార్డ్స్ ని జనాలు పూర్తిగా మర్చిపోయారు. అలాంటి రోజులలో కూడా పుష్ప-2 సినిమా 50 రోజుల కేంద్రాల విషయంలో సరికొత్త రికార్డుని సృష్టించబోతోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా కలిపి 500 కేంద్రాలలో 50 రోజులు పూర్తి చేసుకోబోతుందని వార్తలు వస్తున్నాయి. అయితే పుష్ప-2 సినిమా 50 రోజుల పండుగను రాజమండ్రిలో జరుపుకోనున్నారట.
ఈ ఈవెంట్ పై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్మిషన్ ఇస్తారో లేదో అని కొంత సందిగ్ధంలో చిత్ర యూనిట్ ఉన్నారట. ఒకవేళ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పర్మిషన్ కనుక ఇచ్చినట్లయితే రాజమండ్రిలో ఈవెంట్ ఘనంగా నిర్వహిస్తారు. ఈ విషయం తెలిసి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా పుష్ప 2 మూవీ వచ్చిన తర్వాత గేమ్ చెంజర్ మూవీ వచ్చి డిజాస్టర్ అయింది.