పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి తెలియని వారుండరు. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో స్పిరిట్ ఒకటి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రానున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచే అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు సినీ విశ్లేషకులు . తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ రూమర్ వైరల్ గా మారుతుంది. మెగా యాక్టర్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.


ఇప్పటికే బాలీవుడ్ స్టార్ కపుల్ కరీనాకపూర్, సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు కలిసి ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇందులో ఓ కీలక పాత్రలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇప్పటికే వరుణ్ తేజ్ తో సందీప్ చర్చలు కూడా జరిపారట. అవి ఇంకా ఫైనల్ కాలేదు. కానీ వరుణ్ తేజ్ నుంచి కూడా పాజిటివ్ గా రెస్పాన్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది.


ఇది స్పిరిట్ లో నెగిటివ్ రోల్ అని సమాచారం. హీరో పాత్రకు చాలా దీటుగా ఈ రోల్ ని రాసినట్లుగా టాక్ వినిపిస్తోంది. సందీప్ సినిమాలలో హీరో, విలన్ పాత్రలు చాలా బలంగా ఉంటాయి. యానిమల్ తో అది మరోసారి ప్రూవ్ అయింది. మరోవైపు స్పిరిట్ సినిమాకు సంబంధించి కథ విషయంలో కూడా అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.



దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన గత సినిమాలో అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ వంటి సినిమాలలో చూపించినట్లుగా స్పిరిట్ లో కూడా ఓ వినూత్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడని సమాచారం అందుతోంది. ప్రభాస్ ఈ సినిమాలో కాస్త నెగిటివ్ షెడ్ లో కనిపించనున్నారట. ప్రభాస్ మొదటిసారిగా పోలీస్ పాత్రలో నటించనున్నారనే విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: