సైఫ్ అలీ ఖాన్ కి జరిగిన సర్జరీల కారణంగా వైద్యులు సైతం ఒక వారం రోజులపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలంటు తెలియజేశారట. సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్ అయ్యే సమయంలో తన వెంట ఆమె తల్లి షర్మిల ఠాకూర్, అలాగే భార్య పిల్లలు కూడా సైఫ్ అలీ ఖాన్ తో ఇంటికి చేరుకున్నారు. అయితే సైఫ్ అలీ ఖాన్ డిశ్చార్జ్ అవుతున్నారనే విషయం అభిమానులకు తెలియగానే భారీ ఎత్తున అభిమానులు ఇంటికి చేరడంతో భారీ బందోబస్తు పోలీసులు తన ఇంటి వద్ద ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అలాగే సైఫ్ ఇంటి చుట్టూ కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ఈనెల 16వ తేదీన గుర్తు తెలియని ఒక అగంతకుడు సైఫ్ ఇంట్లోకి చొరబడి మరి దొంగతనం చేస్తూ ఉండగా సైఫ్ తనని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో సైఫ్ పైన కత్తితో దాడి చేసి పారిపోయారట.. సైఫ్ అలీ ఖాన్ బిగ్గరగా అరవడంతో తన కుమారుడు తన తండ్రిని కిందికి తీసుకువచ్చి మరి ఆటోలో నుంచి లీలావతి హాస్పిటల్ కు వెళ్లారట. సైఫ్ పైన దాడి చేసిన నిందితున్ని కూడా పోలీసులు పట్టుకోవడం జరిగింది. అయితే ఈ నిందితుడు బంగ్లాదేశ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అట. అక్రమంగా ఇండియాలోకి వచ్చి ఉద్యోగం కోసం పేరు మార్చుకొని మరి.. దొంగతనాలు చేస్తూ ఉన్నారని పోలీసులు తెలిపారు. ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏమిటంటే దొంగతనానికి వెళ్లినది సైఫ్ ఇల్లు అని తెలియదని విచారణలో నిందితుడు తెలియజేశారట.