మన టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కించిన సాలిడ్ యాక్షన్ డ్రామా డాకూ మహారాజ్. భారీ అంచనాల మధ్య .. మూడు పెద్ద సినిమాల పోటీ లో రిలీజ్ అయిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్ల లోకి వచ్చింది. ఈ సినిమా కోసం కేవలం నందమూరి .. బాలయ్య అభిమాను లతో పాటు ప్రతి తెలుగు సినీ ప్రేమికుడు కూడా ఎంతో ఆసక్తి తో వెయిట్ చేశాడు.
ఈ సినిమా కు రిలీజ్ కు ముందే రు. 83 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇప్పటికే రు. 170 కోట్ల గ్రాస్ వసూళ్లు ప్రపంచ వ్యాప్తంగా డాకూ కొల్ల గొట్టేశాడు. ఇక ఫైనల్ గా సినిమా పై ఉన్న అంచనాలు అందుకున్న డాకూ మహారాజ్ సినిమా ను ఇప్పుడు ఇతర భాషల్లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో నే నార్త్ లో డాకు మహారాజ్ ని రిలీజ్ కి మేకర్స్ సర్వం సిద్ధం చేశారు. హిందీలో డాకూ మహారాజ్ సినిమా ను ఈ జనవరి 24 నుంచి థియేటర్స్ లో కి దింపుతున్నట్టు తెలిపారు.
ఈ క్రమంలో నందమూరి .. బాలయ్య ఫ్యాన్స్ అందరూ హిందీలో ఈ కొంచెం గ్యాప్ లో అయినా ప్రమోషన్స్ చేయాలని కోరుకుంటున్నారు. మరి ఇక్కడ హిట్ కొట్టిన డాకూ మహారాజ్ కు హిందీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ఇక డాకూ మహారాజ్ తో వరుసగా నాలుగో హిట్ తన ఖాతా లో వేసుకున్న బాలయ్య ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కే అఖండ 2 సినిమా లో నటించేందుకు రెడీ అవుతున్నాడు.