వేణు స్వామి చాలా రోజుల నుండి మీడియాలో హాట్ టాపిక్ గా ఉన్న పేరు.. అయితే ఈయన సినీ సెలబ్రిటీల, రాజకీయ నాయకుల జ్యోతిష్యాలు చెబుతూ ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. గతంలో ఈయన జ్యోతిషానికి వ్యాల్యూ ఉన్నది. ఎందుకంటే ఈయన చెప్పిన రెండు మూడు జ్యోతిష్యాలు నిజమయ్యాయి. అలా సమంత, నాగచైతన్య విడాకులు, నయనతార పెళ్లి తర్వాత జీవితం ఇబ్బందుల్లో పడిపోవడం, రకుల్ ప్రీత్ సింగ్ కి పెళ్లి జీవితం కలిసి రాకపోవడం..ఇలా కొన్ని విషయాల నిజమయ్యాయి. అయితే ఆ తర్వాత రాజకీయాల గురించి కూడా మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ ఆంధ్రాలో జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారని చెప్పిన జరగలేదు..


 తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వేణు స్వామి ఒక సంచల నిర్ణయం తీసుకొని.. ఇక జ్యోతిష్యాలు చెప్పడం మానేస్తాను అని ఓ వీడియో రిలీజ్ చేశారు. అలా చాలా రోజులు సైలెంట్ గా ఉన్న ఈయన ఎప్పుడైతే నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ చేసుకున్నారో ఆ వెంటనే వీరిద్దరికి సంబంధించిన జ్యోతిష్యం చెప్పి మళ్లీ మీడియాలో సంచలనం సృష్టించారు. అలా శోభిత, నాగచైతన్య కూడా సమంత, నాగచైతన్య లాగే విడిపోతారని, శోభిత చైతన్య జీవితం 2029 వరకే బాగుంటుందని, ఆ తర్వాత ఒక మహిళ కారణంగా వీరిద్దరి మధ్య కూడా గొడవలు వచ్చి విడాకులు అవుతాయని చెప్పి సంచలనం సృష్టించారు. అయితే ఈ విషయం అక్కినేని ఫ్యాన్స్ నీ  ఫైర్ అయ్యేలా చేసింది..అలాగే వేణు స్వామి పై మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారు.ఈ విషయంలో తెలుగు ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్ సభ్యులు కూడా వేణు స్వామి వ్యాఖ్యాలను తీవ్రంగా ఖండించి మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయం కోర్టు దాకా వెళ్లడంతో ముందే వేణు స్వామి కోర్టులో స్టే తెచ్చుకున్నారు.


అలాగే తెలంగాణ హైకోర్టు కూడా వేణు స్వామికి మద్దతుగా నిలిచి స్టే ఇచ్చిన.. ఆ ఇచ్చిన స్టే రద్దు చేసింది. మళ్లీ కోర్టు మహిళ కమిషన్ ఇచ్చిన  ఫిర్యాదుని తీసుకొని ఈ ఫిర్యాదు ని పూర్తిగా దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని సూచించింది. వేణు స్వామి మహిళా కమిషన్ ఎదుట హాజరై దర్యాప్తుకు సహకరించాలని,వారం రోజులలోపు కచ్చితంగా వేణు స్వామి మహిళా కమిషన్ ఎదుట హాజరవ్వాలని తెలియజేసింది కోర్టు.. వెంటనే వేణు స్వామి మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యి బహిరంగంగా క్షమాపణలు చెప్పినట్టు మీడియా వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈరోజు మహిళా కమిషన్ ఎదుట హాజరయ్యి ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయనని, శోభిత, నాగచైతన్యలపై చేసిన ఈ వ్యాఖ్యలను తాను  వెనక్కి తీసుకుంటున్నానని, ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ కావు అని వేణు స్వామి క్షమాపణలు చెప్పారట.. ఈ విషయం పైన వేణు స్వామికి మహిళా కమిషన్ కూడా వార్నింగ్ ఇచ్చి పంపించారట.. మొత్తానికి దిగివచ్చి క్షమాపణలు చెప్పారు వేణు స్వామి.

మరింత సమాచారం తెలుసుకోండి: