ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 అర్ధ శతదినోత్సవం దిశగా పరుగులు తీస్తోంది. జనవరి 17 నుంచి రీలోడెడ్ వెర్షన్‌ అంటూ ఓ 20 నిమిషాలు అదనపు ఫుటేజ్‌ను తీసుకురావడంతో ప్రస్తుతం ప్రేక్షకులు ఆ సీన్ల గురించి చర్చించుకుంటున్నారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ లుక్, పాటలు, టీజర్, ట్రైలర్‌లతో పాటు ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలతో సినిమాపై అంచనాలను పెంచేశారు మేకర్స్ . ఈ హైప్ నేపథ్యంలో పుష్ప 2 థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రైట్స్‌ కోసం బయ్యర్లు ఎగబడ్డారు. నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా పుష్ప 2 ఏకంగా రూ.1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి భారతీయ చిత్ర పరిశ్రమలోనే సరికొత్త బెంచ్ మార్క్‌లు క్రియేట్ చేసింది.అయితే ఇప్పుడు మరో సరికొత్త సన్నివేశాన్ని కూడా జోడిస్తూ ఓటీటీ లోకి తీసుకురాబోతున్నామంటూ మేకర్స్ ప్రకటించారు. అయితే ఈసారి 10 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను జోడించి, ఓటీటీ నెట్ఫ్లిక్స్ లోకి విడుదల చేయబోతున్నారట. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు.

 ఇప్పటికే రీలోడెడ్ వర్షన్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న పుష్ప2 ఓటీటిలోకి వచ్చిన తర్వాత మరో 10 నిమిషాల సన్నివేశంతో ఎలా ఆకట్టుకోబోతోందని అభిమానులు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారని చెప్పవచ్చు. ఇకపోతే నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే పుష్ప 2 తో లెక్కలు పెంచాలి అని, రికార్డ్స్ బ్రేక్ చేయాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఇదిలావుండగా 45వ రోజైన శనివారం ప్రపంచవ్యాప్తంగా రూ.1.12 కోట్లు రాబట్టింది పుష్ప 2. అయితే వీకెండ్ కావడం, 20 నిమిషాల ఫుటేజ్‌పై మౌత్ టాక్ బాగానే ఉండటంతో మరికొన్ని రోజులు అల్లు అర్జున్ స్టడీగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: