ఇక సోనియా- యష్ విషయానికి వస్తే.. వీరిద్దరూ పెళ్లి చేసుకుని రెండు రోజులు కూడా కాకుండానే ఈ షోలోకి అడుగుపెట్టారు. అయితే షోలోకి సోనియా తో అడుగుపెట్టిన యష్ మాట్లాడుతూ.. తనకి తన చెల్లి శ్వేత అంటే చాలా ఇస్తామని చెప్పారు. తనకోసమే యష్ ఫారిన్ కి వెళ్లి చదువుకుని.. సెటిల్ అయ్యి తనకి పెళ్లి చేశానని అన్నారు. ఒక్క సంవత్సరం క్రితమే ఆమె చనిపోయిందని యష్ ఎమోషనల్ అయ్యారు. అనంతరం సోనియా కూడా ఎమోషనల్ అవుతూ.. 'శ్వేతమ్మ ని అంతా కాకపోయినా, నా వరకు ఎంత అయితే అంతా నేను ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉంటాను' అని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా సోనియా ని ఏ కూరగాయాలతో పోల్చుతావు అని ఓంకార్ యష్ ని అడుగుతాడు. దానికి యష్ ఆలోచించకుండా.. టొమాటో అని అంటాడు. ఎందుకంటే అన్నీ కూరగాయాలతో టొమాటో ఆకర్షణీయంగా, కలర్ ఫుల్ గా ఉంటుందని అంటాడు. అలాగే నేను సోనియాని చాలా బాగా హ్యాండిల్ చేయగలుగుతాను అని చెప్పుకొచ్చాడు. దానికి సోనియా కూడా అవును అని నవ్వుతూ అంటుంది.
ఇక సోనియా బిగ్ బాస్ సీజన్ 8 లో కంటెస్టెంట్ అడుగు పెట్టింది విషయం తెలిసిందే. ఈమె బిగ్ బాస్ హౌస్ లో నాలుగైదు వారాల్లో ఉన్నప్పటికీ చాలా మందికి తెలిసిపోయింది. ఎందుకంటే ఈమె బిగ్ బాస్ హౌస్ లో చేసిన హడావిడి అంతా ఇంత కాదు.