ఇక రామ్ చరణ్ అలాగే బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించబోతున్నాడు. ఉప్పెన సినిమాతో మంచి హిట్ అందుకున్న బుచ్చిబాబు ఈ సినిమాకు... కథ రాసుకుని దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.
అయితే... మొన్నటి వరకు ఈ సినిమాపై మంచి ఆశలు పెట్టుకున్న జాన్వి కపూర్... ఇప్పుడు కాస్త భయపడుతున్నారట. పెద్ద హీరోలతో సినిమాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆమె అనుకుంటున్నారట. ఇటీవల రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజెర్ సినిమా... డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సినిమాకు పెట్టిన డబ్బులు వస్తున్నాయట. వాస్తవానికి అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 కంటే ఎక్కువ కలెక్షన్లు గేమ్ చేంజర్ రాబడుతుందని అందరూ అనుకున్నారు.
కానీ సినిమా జనాలకు పెద్దగా ఎక్కలేదు. దీంతో సినిమాపై నెగటివ్ టాక్ రావడమే కాకుండా బాక్సాఫీస్ ముందు కుప్పకూలింది. అయితే ఈ సినిమాపై నెగిటివ్ ట్రోలింగ్స్ రావడంతో... హీరోయిన్ జాన్వి కపూర్... కాస్త భయపడుతున్నారట. కానీ... తన తల్లి శ్రీదేవి స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నారట. ఇందులో భాగంగానే ఈనెల 27వ తేదీన హైదరాబాదులో ప్రారంభమయ్యే... ఈ సినిమా షెడ్యూల్లో కూడా పాల్గొనబోతున్నారట జాన్వి కపూర్.