గత ఏడాది మంచి విజయాలను అందుకున్న హీరోయిన్ శ్రద్ధ కపూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. స్ర్తీ 2 చిత్రంతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ అమ్మడు ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ అయితే సంపాదించుకున్నది. తన అందంతో అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ నటించిన సాహో సినిమాలో హీరోయిన్గా నటించింది. దీంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితరమైంది. గతంలో ఒక లగ్జరీ కారు కొన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తాజాగా ఒక లగ్జరీ అపార్ట్మెంట్ను కూడా కొనుగోలు చేసినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి



ఇంటి కోసం శ్రద్ధ కపూర్ భారీగానే ఖర్చు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. ఈమె తండ్రి శక్తి కపూర్ తో కలిసి కొత్త ఇంటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. అది కూడా ముంబై ప్రాంతంలో కొనుగోలు చేసిందట. అందుకు సంబంధించి పూర్తి ప్రక్రియ ఈనెల 13వ తేదీన పూర్తి అయినట్లు సమాచారం. అందుతున్న నివేదిక ప్రకారం ముంబైలో జుహులో అత్యధికంగా ఖరీదైన ప్రాంతాలలో ఈమె అరేబియా సముద్రానికి దగ్గరలో లగ్జరీ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిందట.



శ్రద్ధా కపూర్ ఇల్లు 1042.73 చదరపు అడుగులలో ఉన్నదట. ఈమె ఇంటి ధర మొత్తం 7 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు సమాచారం. గతంలో ఒక అపార్ట్మెంట్ ను రూ 72 లక్షలతో ఒక ఏడాదికి మాత్రమే లీజు తీసుకున్నదట. కానీ ఇప్పుడు ఏకంగా తన సొంతంగా ఒక ఇంటిని కొనుగోలు చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నటి ఫ్లాట్లో నాలుగు కారు పార్కింగ్ ప్రాంతంతో ఉంటుందట. వెయ్యి రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజు తో పాటు 36వేల స్టాంపు డ్యూటీ కూడా ఇటీవలే కట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం విన్న అభిమానుల సైతం శ్రద్ధా కపూర్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: