సైఫ్ అలీ ఖాన్ రీసెంట్ గానే కత్తి దాడికి గురై తాజాగా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన సంగతి మనకు తెలిసిందే.. ఆయన పై జనవరి 16న కత్తితో అటాక్ జరిగింది. ఇక సైఫ్ పై దాడి చేసిన నిందితుడు కూడా దొరికిన సంగతి మనకు తెలిసిందే.ఈ విషయం పక్కన పెడితే.. తాజాగా సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించి ఒక సంచలన వార్త వినిపిస్తుంది.అదేంటంటే.. సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించిన దాదాపు 15 వేల కోట్ల ఆస్తులు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంది  అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకీ ఆ 15 వేల కోట్ల ఆస్తులు ఎక్కడివయ్యా అంటే..సైఫ్ అలీ ఖాన్ పటౌడి రాజవంశీయుల కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అనే సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన తండ్రి మన్సూర్ అలీ ఖాన్ అప్పట్లో భారతదేశపు అతిపెద్ద క్రికెటర్. 

ఇక 15 వేల కోట్ల ఆస్తి విషయానికి వస్తే..పటౌడి రాజ వంశీయుల ముత్తమ్మమ్మ అబీదా సుల్తాన్ భారతదేశం విభజన జరిగిన సమయంలో తన ఆస్తులు ఇక్కడే వదిలేసి పాకిస్తాన్ కి వెళ్ళిపోయింది. అయితే భారతదేశం విభజన జరిగిన సమయంలో ఎవరైతే దేశాన్ని వదిలి మరో దేశానికి వెళ్లిపోయేటప్పుడు ఆ ఆస్తిని ఇండియాలో వదిలి వెళ్ళిపోతారో ఆ ఆస్తి ఎనిమి చట్టం కిందికి వస్తుంది అని అప్పటి ఇండియా గవర్నమెంట్ తేల్చేసింది. అయితే అలా అభిదా  సుల్తాన్ వదిలి వెళ్లిన 15 వేల కోట్ల ఆస్తి ఎనిమి చట్టం ప్రకారం మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లుతుంది అని ప్రభుత్వం వాళ్లు అనగా సైఫ్ అలీ ఖాన్ మాత్రం దానికి అడ్డుకట్ట వేసి అది మా వారసత్వపు ఆస్తి.. మీకు ఎలా దక్కుతుంది అని దానిపై సర్వహక్కులు నాకు ఉన్నాయని కోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.

ఇక కోర్టు అప్పట్లో స్టే ఇచ్చినప్పటికీ దీన్ని 2024 డిసెంబర్ 13న భూపాల్ హైకోర్టు ఈ స్టే ని ఎత్తివేసింది. అయితే స్టే ఎత్తివేసాక 30 రోజుల పాటు మళ్ళీ ఆపిల్ చేసుకోవాలి.కానీ 15 వేల కోట్ల ఆస్తి కి సంబంధించి ఎవరూ కూడా స్పందించలేదు.దాంతో ఆ పదిహేను వేల కోట్ల ఆస్తి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెందుతుంది అని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది.మరి హైకోర్టు ఇచ్చిన తీర్పును విస్మరిస్తూ సుప్రీంకోర్టులో సైఫ్ అలీఖాన్ ఏమైనా పోరాడతారా లేక ఆ ఆస్తులు నాకు ఎందుకులే అని వదిలేస్తారా అనేది తెలియాల్సి ఉంది.. ఏది ఏమైనప్పటికి ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ కి బ్యాడ్ టైమ్ నడుస్తుందని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: