ఈ మధ్యకాలంలో సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా నెగిటివ్ రివ్యూల హవా కనిపిస్తూ ఉన్నది. చాలామంది సోషల్ మీడియాని తప్పుగా ఉపయోగిస్తున్నారని చివరికి హీరోలే స్పందించే పరిస్థితి ఏర్పడింది. దీనివల్ల అటు నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలు వాటిల్లుతున్నాయట. సినిమా ఇంకా రిలీజ్ కాకుండానే కొంతమంది నెగిటివ్ సృష్టించగా.. మొదటి షో చూసిన వెంటనే చాలామంది నెగటివ్ రివ్యూలతో సినిమాలను ఇబ్బంది పెడుతున్నారు. ఒక హీరో అభిమానులు మరొక హీరో సినిమాను తొక్కేయాలని ఇండస్ట్రీలో ప్రయత్నాలు జరుగుతున్నాయనే విషయం చాలా స్పష్టంగా ఇప్పుడు కనిపిస్తోంది. తాజాగా ఇలాంటి విషయాలను బయటపెట్టాడు ప్రముఖ పూల చొక్కా నవీన్ రివ్యూ వర్క్..



ఇటీవలే పలు చిత్రాలకు పుచ్చుక్ పుచ్చుక్ రివ్యూ వర్గా  అంటూ తన రివ్యూలతో  మాట్లాడే నవీన్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా గురించి ఒకానొక సందర్భంలో పలు వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు ఆ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. దేవర సినిమా రిలీజ్ సమయంలో కొంతమంది తనకు నెగిటివ్ రివ్యూ రాయాలి అంటూ సంప్రదించారని వెల్లడించారు. అయితే అది కూడా ఒక స్టార్ హీరో పిఆర్ఓ తన దగ్గరకు వచ్చి మరి ఇలాంటి నెగటివ్ రివ్యూస్ రాస్తే పదివేల రూపాయలు ఇస్తానంటూ చెప్పారట.



అయితే తాను ఆఫర్ విన్న తర్వాత ముఖ్యంగా సినిమా ఎలా ఉంటే అలా రివ్యూ రాస్తానని సినిమా బాగున్నప్పటికీ కూడా నెగిటివ్ రివ్యూ రాస్తే తన వ్యాల్యూ దెబ్బతింటుందని కూడా చెప్పి ఆఫర్ ను రిజెక్ట్ చేశానని తెలిపారు నవీన్.. నవీన్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఎన్టీఆర్ దేవర సినిమా మీద కావాలనే కొంతమంది కుట్ర చేశారని విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హీరోల వీఆర్వోలు తెర వెనుక తమ హీరోల సినిమాల కంటే ఇతర హీరోల చిత్రాలను తొక్కేయడంలోనే చాలా బిజీ అవుతున్నారనే విషయం ఇప్పుడు స్పష్టం అవుతున్నది. మొత్తానికి ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ రివ్యూవర్ కి ఆఫర్ చేసిన ఆ హీరో పిఆర్ఓ ఎవరా అని తెగ వెతికేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: