దీంత ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ షాక్ అయిపోయింది. మెగా హీరో బ్యాక్ గ్రౌండ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అందరికీ తెలుసు . అలాంటి ఒక హీరో నెగిటివ్ షేడ్స్ పాత్రలో నటించడం ఏంటి..? అంటూ ఆశ్చర్యపోతున్నారు జనాలు. అయితే పరిస్థితులు బాగోలేక ఆయనకు హీరోగా అవకాశాలు వస్తున్న అవి సద్వినియోగం చేసుకోలేకపోవడంతోనే వరుణ్ తేజ్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు అన్న టాక్ వైరల్ గా మారింది . మరి కొంతమంది వర్షెన్ మాత్రం వేరేలా ఉంది . వరుణ్ తేజ్ ఈ ఆఫర్ ఒప్పుకోవడానికి కారణం డైరెక్టర్ అంటున్నారు.
ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా..? సినిమా ఇండస్ట్రీని తన డైరెక్షన్ తో షేక్ చేసేస్తున్న సందీప్ రెడ్డివంగా . సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే మూవీ తెరకెక్కుతుంది . ఈ సినిమాల్లో విలన్ షేడ్స్ పాత్రలో ఉన్న ఒక రోల్ కోసం వరుణ్ తేజ్ ని అప్రోచ్ అయ్యారట సందీప్ రెడ్డివంగా. అనూహ్యంగా సందీప్ రెడ్డివంగా ఆఫర్ ని యాక్సెప్ట్ చేశారట వరుణ్ తేజ్ . ప్రజెంట్ ఈ వార్త సినిమా ఇండస్ట్రీలో బాగా వైరల్ గా మారింది . ఖచ్చితంగా ఈ సినిమాతో వరుణ్ తేజ్ మంచి హిట్ తన ఖాతాలో వేసుకుంటాడు అంటున్నారు జనాలు..!