ఆమధ్య విడుదలైన ‘మట్కా’ మూవీకి కానీసపు ఓపెనింగ్స్ కూడ రాకపోవడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరిచింది. దీనితో అతడితో సినిమాలు తీయాలి అని ఆలోచిస్తున్న దర్శక నిర్మాతలు ఆలోచనలలో పడ్డారు అన్న గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో దర్శకుడు మర్లపాక గాంధీ వరుణ్ తేజ్ తో తీయబోతున్న లేటెస్ట్ మూవీ టైటిల్ ప్రకటన అందరి దృష్టిని ఆకర్షించింది. ‘కొరియన్ కనకరాజు’ అన్న టైటిల్ తో నిర్మాణం జరుపుకోబోతున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రిష్ సొంత నిర్మాణ సంస్థ అయిన ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్’ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మూవీతో మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకున్న మేర్లపాక గాంధీ ఆతరువాత దర్శకత్వం వహించిన సినిమాలు పరాజయం చెందడంతో అతడితో సినిమాలు చేయడానికి మీడియం రేంజ్ హీరోలు పెద్దగా ఆశక్తి కనపర్యచం లేడు.
మరీ ముఖ్యంగా నానీతో తీసిన ‘కృష్ణార్జున యుద్దం సూపర్ ఫ్లాప్ గా మారడంతో ఈ దర్శకుడు పరిస్థితి మరింత అయోమయంలో పడిపోయింది. ఇలాంటి పరిస్థితులలో వరుణ్ తేజ్ తో కలిసి తీయబోతున్న ‘కొరియన్ కనకరాజు’ అతడి కెరియర్ కు కీలకంగా మారింది. అవుట్ అండ్ అవుట్ కామెడీగా నిర్మాణం జరుపుకోబోతున్న ఈమూవీ వరుణ్ తేజ్ కు గతంలో మంచి పేరు తెచ్చిపెట్టిన ‘ఎఫ్ 2’ లా ఘన విజయం వస్తుందేమో చూడాలి. ఈమధ్య కాలంలో టైటిల్ ను బట్టి సినిమాకు క్రేజ్ ఏర్పడుతున్న పరిస్థితులలో ఇలాంటి వెరైటీ టైటిల్ ఎంచుకున్నారు అనుకోవాలి..