ఒకప్పుడు తీవ్ర ఆర్థిక బాధలు ఎదుర్కున్న అమితాబ్ ఈరోజు వందలాది కోట్ల సంపన్నడు. ప్రస్తుతం ఈయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి ఎంటర్ అవ్వడమే కాకుండా అక్కడ కూడ ఆయన వందల కోట్ల ఆదాయం ఆర్జించడం బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ముంబాయిలోని
ఓషివారాలోని క్రిస్టల్ గ్రూప్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ‘ది అట్లాంటిస్’ లో బిగ్ బి ఒక అపార్ట్‌మెంట్‌ను 2021 ఏప్రిల్‌లో 31 కోట్లకు కొన్నారట. ఇప్పుడు అదే అపార్ట్మెంట్ ను అమితాబ్ 83 కోట్లకు విక్రయించడం హాట్ టాపిక్ గా మారింది.
ఈ అపార్ట్‌మెంట్ దాదాపు 5,704 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని తెలుస్తోంది. ఇదే అపార్ట్ మెంట్ లో బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ అద్దెకు ఉండటమే కాకుండా ఆమె నెలకు 10 లక్షలు అమితాబ్ కు అద్దె కడుతోందని టాక్. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ మాత్రమే కాకుండా యన కుటుంబం కూడా రియల్ ఎస్టేట్ పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా ఓషివారా,మగథానే (బోరివాలి ఈస్ట్) ప్రాంతాల్లో నివాస, వాణిజ్య ప్రాపర్టీలను అమితాబ్ తన కొడుకు అభిషేక్ తో కలిసి 2020 నుంచి ఇప్పటివరకు బచ్చన్ కుటుంబం రియల్ ఎస్టేట్‌లో దాదాపు 200 కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పెట్టుబడుల పై అమితాబ్ కు కోట్ల రూపాయలలో ఆదాయం వస్తోందని బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది..