సినిమాల పరంగా చూసుకున్నట్లు అయితే గత కొంతకాలంగా మెగా కుటుంబానికి పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు. చిరంజీవి కూడా తికమక కథలతో అభిమానులను కూడా నిరాశ పరుస్తున్నారు. భారీ అంచనాల మధ్య మెగా హీరోల చిత్రాలు విడుదలైన కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా డిజాస్టర్ టాకులతో ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేని సినిమాలో కూడా ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. మెగా హీరోలతో సినిమాలు అంటే చాలామంది నిర్మాతలు  భయపడేలా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సినిమాలు కొన్న బయ్యర్లకు కూడా భారీగానే నష్టాలు వస్తున్నాయట.



గడిచిన రెండేళ్లలో బ్యాక్ టు బ్యాక్ ఏడు డిజాస్టర్ చిత్రాలు మెగా హీరోలలో పడిపోయాయట. చివరిగా విరూపాక్ష సినిమా సాయి ధరంతేజ్ నటించిన ఈ సినిమా 100 కోట్ల రూపాయల క్లబ్లో చేరింది. వాల్తేరు వీరయ్యతో సినిమా సక్సెస్ అందుకోవడంతో మెగా కుటుంబం మళ్లీ సక్సెస్ ట్రాక్ లో పడిందని అనుకునే లోపే ఒక్కొక్క సినిమాగా ప్లాపులను చవిచూశాయి. పవన్ కళ్యాణ్, సాయి ధరంతేజ్  నటించిన బ్రో సినిమా 69 శాతం మాత్రమే రికవరీ అయ్యిందట. ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలిందట. చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. కేవలం 30 శాతం మాత్రమే రికవరీ అయినట్లు ట్రెండ్ వర్గాలు తెలుపుతున్నాయి.


నాగబాబు కుమారుడు నటించిన వరుణ్ తేజ్ సినిమా గని ఫ్లాప్ గా మిగిలింది.. గాండీవ దారి అర్జున కూడా 8% మాత్రమే రికవరీ సాధించిందట. ఇటీవల వచ్చిన ఆపరేషన్ వాలెంటైన్ ,మట్కా సినిమా కూడా ఘోరమైన డిజాస్టర్ ని మూటకటుకుంది. ఉప్పెన సినిమాతో హిట్టు కొట్టిన వైష్ణవ్ తేజ్.. ఆదికేశవ సినిమాతో భారీ డిజాస్టర్ ని అందుకున్నారు. ఇటీవల రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా నటించిన గేమ్ ఛేంజర్ సినిమా కూడా అభిమానులను నిరాశపరిచింది. ఈ సినిమా 50 శాతం కంటే తక్కువగా రికవరీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే రికవరీ శాతం రోజురోజుకి తగ్గిపోతూనే ఉంది.


ప్రస్తుతం ఇలా మెగా హీరోలకు వరస షాకులు తగులుతున్నప్పటికీ రాబోయే చిత్రాలు విశ్వంభర,OG, హరిహర వీరమల్లు సినిమాల పైన అభిమానులు అంచనాలు పెట్టుకున్నరు. మరి ఏం జరుగుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: