పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చిన్నతనంలో ఓ వ్యాధి ఉండేదని ఆయన ఇప్పటికే కొన్ని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఆయన మానసిక వ్యాధితో బాధపడుతూ కనీసం ఫ్రెండ్స్ తో కూడా కలవకుండ ఒంటరిగా ఉంటూ బుక్స్ చదువుతూ గడిపే వాడని,ఓ రోజు ఆ ఒంటరితనం భరించలేక ఇంట్లో ఆత్మహత్యయత్నానికి కూడా ప్రయత్నించారని, చిరంజీవి గన్ తో కాల్చుకొని చనిపోవాలనుకున్నరని, కానీ సురేఖ నాగబాబు ఇద్దరు తిట్టడంతో సైలెంట్ అయ్యానని ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చెప్పారు.గఅయితే పవన్ కళ్యాణ్ గురించి ఆయన సన్నిహిత డాక్టర్ రాజు రవితేజ ఆయనకున్న వ్యాధి గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పారంటూ డాక్టర్ రాజు రవితేజ మాటల్ని గుర్తు చేసుకున్నాడు సినీ విమర్శకుడు దాము బాలాజీ.. పవన్ కళ్యాణ్ కి ఎన్పీడీ అనే వ్యాధి ఉందని, ఈ వ్యాధి వచ్చిన వారిలో రెండు రకాలుగా ఉంటారు.

ఒకటి చిన్నతనంలో అద్దంలో చూసుకుని ఎవరికి వారే మురిసిపోవడం. అయితే అది పెద్ద అయ్యే కొద్ది మారిపోతారు. ఆ తర్వాత ఈ వ్యాధి ఉన్న కొంత మందిలో ఇతరులను తక్కువ చేసి చూడడం అందరికంటే నేనే గొప్ప అనే ఫీలింగ్ ఉండడం వంటివి చూస్తాం. ఈ వ్యాధి ఉన్నవారు ఇతరులను చాలా తక్కువ చూపుతో చూస్తారు. అయితే ఈ వ్యాధి తీవ్రత మరి ఎక్కువైతే దాన్ని ఎన్పీడీ అంటారు అంటూ ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సన్నిహిత డాక్టర్ రాజు రవితేజ మాట్లాడిన విషయాలను గుర్తు చేశాడు దామో బాలాజీ. అయితే పవన్ కళ్యాణ్ గురించి సినీ విమర్శికుడు దాము బాలాజీ ఆ ఇంటర్వ్యూలో ఇంకా మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ని కలవడానికి మేము ఓ రోజు ఆయన బాలు సినిమా షూటింగ్ కి వెళ్ళాము. కానీ ఆయనతో మాట్లాడడానికి మాకు ఎవరికీ ధైర్యం చాలలేదు. ఇక పవన్ కళ్యాణ్ సినిమాలో ఎవరైనా సరే గుంపులు గుంపులుగా మాట్లాడుకొని ఉండడం అస్సలు సహించలేరు.

 అలాగే డైరెక్టర్ కట్ చెప్పేటప్పుడు కూడా నోటితో అనకూడదు చేతులతో సైగలు చేయాలి. అలాగే ఆయన యాక్టింగ్ చేస్తున్న సమయంలో ఎవరు కూడా మాట్లాడకూడదు సైలెంట్ గా ఉండాలని కండిషన్లు పెడుతూ ఉంటారు అని డాక్టర్ రాజు రవితేజ మాట్లాడిన మాటలను సినీ విమర్శకుడు దాము బాలాజీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే దాము బాలాజీ మాటలు విన్న చాలా మంది పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ అలాంటివారు కాదు. ఆయనపై నెగటివ్ ప్రచారం చేయడానికే ఈయన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ దాము బాలాజీ పై మండి పడుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ కి అస్తమా వ్యాధి ఉన్న సంగతి మనకు తెలిసిందే. చిన్నతనంలో ఆయన డిప్రెషన్ లోకి వెళ్లిన మాట కూడా వాస్తవమే.కానీ షూటింగ్ సెట్లో పవన్ కళ్యాణ్ అలా ప్రవర్తిస్తారు అని దాము బాలాజీ మాట్లాడిన మాటల్లో మాత్రం నిజం లేదని తేల్చేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: