పుష్ప2 సినిమా హిట్ అయిన ఆనందమే ఆయన ముఖంలో లేకుండా చేసేసారు . కెరియర్ లో ఫస్ట్ టైం జైలుకు వెళ్లడం .. అది కూడా పుష్ప 2 సినిమా కారణంగానే వెళ్లడం .. అల్లు అర్జున్ లైఫ్ లో ఇక కోలుకోలేడు అంటూ చాలా చాలా దారుణంగా మాట్లాడారు. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిన తర్వాత ఫస్ట్ పాన్ ఇండియా స్టార్ జైలుకు వెళ్ళాడు అంటూ వెటకారంగా కూడా కౌంటర్స్ వేశారు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత అసలు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం మానేశాడు అని బయట ప్రపంచానికి కనిపించడం లేదు అని .. అల్లు అర్జున్ చాప్టర్ క్లోజ్ అని ..ఇక సినిమా ఇండస్ట్రీలో నెట్టుకు రాలేడు అంటూ రకరకాలుగా వార్తలు వినిపించాయి .
అదేవిధంగా నెగిటివ్ ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే అదంతా అబద్ధం అంటూ అల్లు అర్జున్ ఫ్యామిలీ సింపుల్ గా కొట్టి పడేసింది . అల్లు స్నేహారెడ్డి.. అల్లు అర్జున్ ..అల్లు అయాన్..చాలా కూల్ గా సింపుల్ గా ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు అంటూ ఒకే ఒక పిక్ తో షేర్ చేసేసింది అల్లు స్నేహారెడ్డి . తన భర్త ఏ విధంగా బయపడట్లేదు ..బాధపడట్లేదు.. దాంకోవట్లేదు అంటూ మేము హ్యాపీగానే ఉన్నామంటూ ఆమె షేర్ చేసిన పిక్స్ ఆధారంగా తెలిసిపోతుంది . దీంతో ఎవరైతే అల్లు అర్జున్ ని ట్రోల్ చేస్తున్నారో .. వాళ్లు ఇక నోరు మూసుకోండి అంటూ బన్నీ ఫాన్స్ ఘాటుగా కౌంటర్స్ వేస్తున్నారు. అంతేకాదు అందరూ వైట్ కలర్ షర్ట్స్ ధరించి ఎంత ఇబ్బందికర సిచువేషన్ అయినా సరే సింపుల్ లైఫ్ ని లీడ్ చేయాలి. అంతేకాదు సింప్లిసిటీతో మైండ్ ప్రశాంతంగా ఉంచుకోవాలి అన్న కాన్సెప్ట్ తోనే ఈ వైట్ షర్ట్ ధరించి మరి పిక్స్ షేర్ చేశారు అంటున్నారు బన్నీ ఫాన్స్..!