టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన సీనియర్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. మెగాస్టార్ చిరంజీవి 2023 వ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా వాల్తేరు వీరయ్య అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇక అదే సంవత్సరం చిరంజీవి "భోళా శంకర్" అనే మరో మూవీ తో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఈ మూవీ తర్వాత చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాను స్టార్ట్ చేశాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం మే 9 వ తేదీన విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే చిరంజీవి "విశ్వంభర" సినిమా షూటింగ్లో పాల్గొంటూనే తన తదుపరి మూడు సినిమాలకు డైరెక్టర్లను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... చిరంజీవి తన తదుపరి మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకులలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి తో చేయబోతున్నాడు. ఇప్పటికే అనిల్ రావిపూడి ఈ విషయంపై అనేక సార్లు స్పందించాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలువడబోతున్నట్లు తెలుస్తోంది.

సినిమా తర్వాత చిరంజీవి "దసరా" మూవీ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇప్పటికే వచ్చేసింది. ఇకపోతే ఇప్పటికే వాల్టేరు వీరయ్య సినిమాతో చిరంజీవి కి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందించిన బాబి తో చిరు మరో మూవీ చేయబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా చిరంజీవి తన తదుపరి మూడు మూవీలకు దర్శకులను ఇప్పటికే సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: