బాలీవుడ్, టాలీవుడ్ తేడా లేకుండా అప్పట్లో ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ ఊర్మిళా మతొండ్కర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎంతో మంది హీరోలకు జోడీగా నటించిన ఈ హీరోయిన్ తన అంద చందాలతో అందరిని ఆకట్టుకునేది. ముఖ్యంగా హారర్ చిత్రాలలో తన నటనకు మాత్రం తిరుగు లేదని చెప్పవచ్చు. ఇక ఊర్మిళ తెలుగులో సినిమాలు చేసి చాలా కాలం అయిన ప్రస్తుతం ఆమె నార్తులోనే సెటిల్ అయిపోయి అక్కడే వివాహం చేసుకొని తన జీవితాన్ని గడిపేస్తూ ఉన్నది. చివరిగా 2018లో బ్లాక్ మెయిల్ అనే చిత్రంలో స్పెషల్ సాంగ్ లో కనిపించిందట. మళ్లీ ఆ తర్వాత ఏ సినిమాలో కూడా నటించలేదట.


ఇటీవలే డైరెక్టర్ రాంగోపాల్ వర్మ, ఊర్మిళా మద్య గొడవలు జరిగాయనే విషయం పైన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో వీరి మధ్య విభేదాలు ఉన్నాయని అందుకే వీరు ఎక్కడ కలిసి కనిపించలేదనే విధంగా వార్తలు వినిపించేవి.. ఇటీవలే సత్య సినిమా రీ రిలీజ్ లో కూడా జేడీ చక్రవర్తికి జోడిగా ఊర్మిళా హీరోయిన్గా ఇందులో నటించిందంట. ఈ రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న ఊర్మిళా వర్మతో గొడవలపై క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.


ఊర్మిళా ఈ విషయం పైన మాట్లాడుతూ.. ఆర్జీవి డైరెక్షన్ చేసిన అంతం, గాయం, రంగీలా వంటి చిత్రాలలో తాను హీరోయిన్గా నటింపచేశారని ఆయన మూవీలో అవకాశం దొరకడం తన అదృష్టమని ఇలాంటి లేనిపోని రూమర్స్ ఎవరూ కూడా నమ్మవద్దని మా మధ్య ఎలాంటి గొడవలు లేదు.. కలవాలి మాట్లాడాలి అనుకుంటే..ప్రస్తుతం ఒక్కొక్కరిది ఒక్కోదారిలో ఉన్నామని ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మీ అందరితో కలిసి మాట్లాడుతున్నాను అలాగే వర్మ గారితో కూడా అంతే అంటూ తెలిపింది. సినిమాకు సంబంధించిన ఏవైనా విషయాలు ఉంటే తానే డైరెక్ట్ గా మాట్లాడుతాను అంటూ తెలియజేసింది ఊర్మిళా మొత్తానికి వర్మతో గొడవలపైన క్లారిటీ ఇచ్చేసింది ఊర్మిళా.

మరింత సమాచారం తెలుసుకోండి: