కాగా సీనియర్ హీరోలలో ఒకరైన బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ ఫుల్ స్వింగ్ మీద హిట్స్ కొడుతూ వచ్చారు. అఖండ , వీరసింహారెడ్డి , భగవంత్ కేసరి , డాకు మహారాజు సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని ముందుకు వెళ్ళిపోతున్నాడు. అయితే బాలయ్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న కూడా ఆయన కెరియర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన "నరసింహనాయుడు" సినిమా "సమరసింహారెడ్డి" లాంటి హిట్స్ మాత్రం హిట్ టాక్ మాత్రం అందుకోలేకపోతున్నాడు .
ఎప్పటినుంచో నందమూరి ఫ్యాన్స్ అలాంటి ఒక హిట్ అందుకోవాలి బాలయ్య అంటూ వెయిట్ చేస్తున్నారు. అది అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది . బాలయ్యకి అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ కి సైతం ఓ సినిమా అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో చాలా సినిమాలు నటించాడు . కానీ అన్ని సినిమాలలోకి ది బెస్ట్ ఆది "సింహాద్రి" అని చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు . "సింహాద్రి" సినిమా తర్వాత అలాంటి ఒక క్రేజీ హిట్ తన ఖాతాలో వేసుకోలేకపోయాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఒక సెక్షన్ ఆఫ్ నందమూరి అభిమానులు ఇప్పటికి బాధపడిపోతున్నారు. ఎన్టీఆర్ నటించిన సినిమాలు హిట్ అవుతున్నాయి కలెక్షన్స్ సాధిస్తున్నాయి . కానీ సింహాద్రి లెవెల్ లో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాయి అంటున్నారు . దీంతో సింహాద్రి లెవెల్ హిట్ జూనియర్ ఎన్టీఆర్ కి అందని ద్రాక్ష గానే మిగిలిపోయింది . ఇప్పుడు ఈ ఇద్దరి కెరీయర్లకి అలాంటి ఒక సినిమా అవసరం . అలాంటి హిట్ ఏ డైరెక్టర్ ఇస్తారో వెయిట్ చేసి చూడాల్సిందే..!