విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. బీమ్స్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేశారు. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పాటు గేమ్ చేంజర్ సినిమా కూడా విడుదల అయింది.

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమాను దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో , ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. అలాగే ఈ మూవీ పై దిల్ రాజు భారీ అంచనాలు కూడా పెట్టుకున్నాడు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో  ఈ సినిమాకు పెద్ద మొత్తంలో కలెక్షన్లు రావడం లేదు. ఇక గేమ్ చెంజర్ సినిమా ద్వారా దిల్ రాజు పెద్ద మొత్తంలో నష్టపోయాడు. ఇప్పట్లో ఆయన తేరు కావడం కష్టమే అనే వాదనను కూడా కొంత మంది వినిపించారు. కానీ గేమ్ చెంజర్ విడుదల అయిన నాలుగు రోజులకే సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల అయ్యి బ్లాక్ బాస్టర్ టాక్ ను తెచ్చుకుంది.

ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఈ మూవీ ఫైనల్ రన్ ముగిసే సరికి 300 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అంచనా వేస్తున్నారు. అదే కానీ జరిగితే దిల్ రాజు కి గేమ్ చేంజర్ ద్వారా వచ్చిన నష్టాలు ఆల్మోస్ట్ సంక్రాంతికి వస్తున్నాం ద్వారా క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది భావిస్తున్నారు. మరి సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫైనల్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: