మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్గా బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఆర్ సి 16 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే బుచ్చిబాబు "ఉప్పెన" సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేయాలి అని ప్రయత్నాలు చేశాడు. ఆల్మోస్ట్ వీరి కాంబోలో సినిమా సెట్ అయింది అని వార్తలు కూడా వచ్చాయి. కానీ చివరి నిమిషంలో బుచ్చిబాబు తన తదుపరి మూవీ ని తారక్ తో కాకుండా రామ్ చరణ్ తో సెట్ చేసుకున్నాడు. తారక్ రిజెక్ట్ చేసిన స్టోరీ తోనే బుచ్చిబాబు , చరణ్ తో సినిమా చేస్తున్నాడు అనే వార్త ఒకటి చాలా రోజులు వైరల్ అయింది. ఇకపోతే విజయ్ దేవరకొండ హీరో గా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వీడి 12 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీ షూటింగ్ జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే చాలా రోజుల క్రితం గౌతమ్ తిన్ననూరి , రామ్ చరణ్ తో ఓ సినిమా చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఇక కొన్ని రోజుల తర్వాత ఈ కాంబో మూవీ క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత విజయ్ తో గౌతమ్ సినిమా ఓకే చేసుకున్నాడు. దానితో విజయ్ తో ప్రస్తుతం గౌతమ్ చేస్తున్న స్టోరీని రామ్ చరణ్ రిజెక్ట్ చేశాడు అని ఓ వార్త వైరల్ అవుతుంది.