టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి బాలయ్య సూపర్ క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి కాంబో లో కొంత కాలం క్రితం భగవంత్ కేసరి అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. అనిల్ రావిపూడి అప్పటివరకు ఎక్కువ శాతం కామెడీ ఓరియంటెడ్ సినిమాలను తెరకెక్కిస్తూ వచ్చాడు. 

మొట్ట మొదటి సారి తన కెరియర్లో ఆయన కామెడీ నీ పక్కన పెట్టి ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని భగవంత్ కేసరి మూవీ తో ట్రై చేశాడు. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే భగవంత్ కేసరి సినిమా తర్వాత బాలయ్య "డాకు మహారాజు" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఇక భగవంత్ కేసరి సినిమా తర్వాత అనిల్ రావిపూడి "సంక్రాంతికి వస్తున్నాం" అనే సినిమాని రూపొందించాడు. ఈ రెండు సినిమాలు కూడా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యాయి. 

ఇక ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయిన డాకు మహారాజ్ సినిమాకు అలాగే జనవరి 14 వ తేదీన విడుదల అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ వచ్చింది. దానితో ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు కూడా మంచి కలెక్షన్లు వస్తున్నాయి. అలా వీరిద్దరూ ఒకే సమయంలో తమ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి మంచి విజయాలను అందుకున్నారు. డాకు మహారాజ్ సినిమాకు బాబీ దర్శకత్వం వహించగా , సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ హీరోగా నటించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులు అయినటువంటి ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి ఈ సినిమాలో వెంకటేష్ కి జోడి గా నటించారు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: