సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ..ఎవరి.. టైం ఎలా మారిపోతుందో ..ఎవ్వరు చెప్పలేం అన్నదానికి ఇది మరొక బిగ్ ఎగ్జాంపుల్ అనే చెప్పాలి . మరీ ముఖ్యంగా ప్రజెంట్ పరిస్థితుల్లో ఇండస్ట్రీలో ఏ హీరో హిట్ అవుతాడు ..ఏ హీరో హర్ట్ అవుతాడు అని చెప్పడమే పెద్ద గగనంగా మారిపోయింది . పెద్ద పెద్ద సినిమాలు కూడా ఫ్లాప్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాపై దిల్ రాజు ఎంత బడ్జెట్ పెట్టాడో అందరికీ తెలుసు . ఒక పాట కోసమే ఏకంగా 75 కోట్లు ఖర్చు చేయించాడు డైరెక్టర్ .


అయితే ఇప్పుడు పరిస్థితి మాత్రం వేరేలా ఉంది . గేమ్ ఛేంజర్  సినిమాపై నెగిటివ్ టాక్ వచ్చింది. గ్లోబల్ ఇమేజ్  గుర్తింపు సంపాదించుకున్న హీరో  నటించిన సినిమా కి పరిస్థితి ఇలా ఉందంటే..  మిగతా స్టార్స్ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు . అయితే చిన్న చిన్న హీరోలు నటించిన సినిమాలు మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి . మరీ ముఖ్యంగా ఇప్పుడు ఒక హీరో పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది . ఆయనే ప్రదీప్ రంగనాథన్ . చాలా సింపుల్ గా ఉండే ఈ హీరో బ్యాక్ టు బ్యాక్ వరుసగా మంచి మంచి సినిమాలను తన ఖాతాలో వేసుకొని తన కెరియర్ గ్రాఫ్ పెంచుకుంటూ పోతున్నారు .



"లవ్ టు డే" సినిమా తో బిగ్ స్టార్ గా మారిపోయిన ప్రదీప్ రంగనాథ్.. ప్రజెంట్ ఆయన ఖాతాలో 6 ప్రాజెక్టులు ఉన్నాయి . మరీ ముఖ్యంగా "డ్రాగన్ , లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ " సినిమాలలో నటిస్తూ తన క్రేజ్ మరింత పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఈ ప్రదీప్ రంగనాథ్ . అయితే ఈయనకి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు ఆయన ఇప్పుడున్న రెమ్యూనరేషన్ ని బాగా పెంచేస్తున్నాడట . పెంచేసాడట . ఒక్కొక్క సినిమాకి ఇప్పుడు 30 కోట్లకి పైగానే  రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారట.



ప్రజెంట్ ఆయన ఖాతాలో ఆరు సినిమాలు ఉన్నాయి . వీటిల్లో మూడు సినిమాలు అఫీషియల్ . అలా చూసుకున్న కూడా 90 కోట్లకు పై మాటనే ఈయన సంపాదించుకుంటున్నాడు . మొత్తంగా ఆ మూడు సినిమాలు కూడా కన్ఫామ్ అయిపోతే 100 కోట్ల పై మాటే.  దీంతో అదృష్టం ఈయన్ని బాగా వరించింది అని .. అసలు హీరో కటౌట్  లేని ఈ ప్రదీప్ రంగనాథ్ .. ఇప్పుడు ఓ స్టాఎ అయ్యాడు అంటూ ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉంది అనేది ఆయనకి ఆ దేవుడికే తెలియాలి. కానీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా ట్రెండ్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: